డైరెక్టర్‌ కంగనా

29 Dec, 2018 01:38 IST|Sakshi
కంగనా రనౌత్‌

‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’.. కంగనా రనౌత్‌ నెక్ట్స్‌ రిలీజ్‌ ఇదే. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జనవరి 25న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ‘పంగా’ అనే సినిమాలో కబడ్డీ ప్లేయర్‌గా నటించనున్నారు కంగనా రనౌత్‌. అశ్వనీ అయ్యర్‌ దర్శకురాలు.

మరి.. ఆ తర్వాత కంగనా సినిమా ఏంటి? అంటే ఓ లవ్‌స్టోరీ అని బాలీవుడ్‌ తాజా టాక్‌. ఈ సినిమాకు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం. పూర్తి విభిన్నమైన లవ్‌స్టోరీతో ఈ చిత్రం రూపొందనుందట. ఇక హైలైట్‌ పాయింట్‌ ఎంటంటే... ఈ సినిమాకు కంగనానే దర్శకత్వం వహిస్తారట. ఇటీవల ‘మణికర్ణిక’ సినిమా ప్యాచ్‌ వర్క్‌ కోసం కంగనా మెగాఫోన్‌ పట్టిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు