దక్షిణాదిలో గొప్ప సినిమాలొస్తున్నాయి

11 Jan, 2020 06:47 IST|Sakshi

‘‘పంగా’ సినిమాలో ఓ మధ్య తరగతి మహిళగా, అందులోనూ తల్లిగా నటించా.. తల్లి పాత్ర పోషించడం చాలా గొప్పగా అనిపించింది’’ అని కంగనా రనౌత్‌ అన్నారు. అశ్వినీ అయ్యర్‌ తివారీ దర్శకత్వంలో కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘పంగా’. జస్సీ గిల్, రిచా చద్దా కీలక పాత్రలు పోషించారు. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కంగనా, అశ్విని విలేకరులతో సమావేశమయ్యారు.

కంగనా రనౌత్‌ మాట్లాడుతూ– ‘‘అశ్విని మంచి డైరెక్టర్‌. పని పట్ల మంచి ఫోకస్, క్లారిటీ ఉంది. నేను చాలా మందితో వరుసగా సినిమాలు చేశాను. కంగనాతో పని చేయడం కష్టం అని మాట్లాడిన వారికి అశ్వినీలాంటి వారే సమాధానం చెబుతున్నారు. ‘పంగా’ చిత్రంలో నాది నేషనల్‌ లెవల్‌ కబడ్డీ క్రీడాకారిణి పాత్ర. ఆటకూ, కుటుంబ బాధ్యతలకూ మధ్య నలిగే పాత్ర.  అప్పుడు ‘మణికర్ణిక’, ఇప్పుడు జయలలిత బయోపిక్‌ ‘తలైవి’ సినిమా చేస్తూ హైదరాబాద్, చెన్నై తిరుగుతూ పూర్తిగా సౌత్‌ ఇండియన్‌గా మారిపోయా. సౌత్‌ ఇండియాలో గొప్ప సినిమాలు వస్తున్నాయి. ఇక్కడి సినిమా కల్చర్‌ నాకు బాగా నచ్చింది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు