వికాస్‌కు ఓ అవకాశం ఇవ్వండి

14 Oct, 2018 05:03 IST|Sakshi
రీచా దూబే, వికాస్‌ బాల్‌, కంగనా రనౌత్‌

ఆరోపణలు ఆగడం లేదు. మేం మద్దతుగా ఉంటున్నాం అని ముందుకొస్తున్న నటీనటులతో ‘మీటూ’ ఉద్యమం సినీ ఇండస్ట్రీల్లో కొనసాగుతూనే ఉంది. తనుశ్రీ దత్తా ఆరోపణలతో మొదలైన ఈ ఉద్యమం చాలా మంది బయటకు వచ్చి నిర్భయంగా మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది. దానికి మద్దతు తెలుపుతూ కొందరు యాక్టర్స్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో నటించబోము అని సినిమాలను ఆపేస్తున్నారు. వికాస్‌ బాల్‌పై వచ్చిన ఆరోపణలను కంగనా రనౌత్‌ నిజమే అంటూ స్పందించారు. ఇప్పుడు దానికి సమాధానంగా వికాస్‌ బాల్‌ మాజీ భార్య  రీచా దూబే కంగనా రనౌత్‌పై కామెంట్లు విసిరారు.

‘‘మీతో ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు ఇంకా అతనితో ఎందుకు ఫ్రెండ్‌షిప్‌ కొనసాగిస్తారు?  ఇంకా వాళ్లతోనే నవ్వుతూ తిరుగుతారెందుకు? అతను తన పనిలో మంచి టాలెంట్‌ ఉందని ఇవన్నీ వదిలేస్తారా? వికాస్‌ నీతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని నీకనిపించినప్పుడు అప్పుడే చెప్పొచ్చుగా. మొన్నటి వరకూ ఫ్రెండ్లీగా మెసేజ్‌లు చేసుకొని ఇప్పుడు ఒక్క అవకాశంతో అంతా మారిపోయిందా? నీతో మీడియా ఫైట్‌ పెట్టుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే అందులో నువ్వు ఆరితేరిపోయావు. సెలబ్రిటీ పవర్‌ని తప్పుగా ఉపయోగించకు.

కంగానాకు ఉన్న ప్రామాణికతేంటి? వికాస్‌ దగ్గర లేనిది ఏంటి? నేను అతని మాజీ భార్య అయినప్పటికీ ఈ డ్రామా చూడలేకపోతున్నాను. నిజం నిరూపించుకోవడానికి అతనికో అవకాశం ఇవ్వండి. నిజం బయటకు రాకముందే అతనికి అనవసరమైన ట్యాగ్స్‌ అతికించకండి. నిజం నిరూపితమైనప్పుడు అతనికేం చెబుతాం?’’ అని ఘాటుగా స్పందించారు. అలాగే మరోవైపు ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్టు సైఫ్‌ అలీఖాన్, బాబీ డియోల్, మలైకా అరోరా, సయేషా ట్వీట్స్‌ చేశారు.

విన్నాక రియాక్ట్‌ అవుదాం
‘హౌస్‌ఫుల్‌ 4’ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. నిజానిజాలు తెలిసే వరకూ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను అని సాజిద్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై సైఫ్‌ అలీ ఖాన్‌ కూడా స్పందించారు. ‘‘సాజిద్‌ ఖాన్‌పై వస్తున్న ఆరోపణలు వింటున్నాను. కానీ సెట్లో అతను అలా ప్రవర్తించడం ఎప్పుడూ చూడలేదు. కానీ రియాక్ట్‌ అయ్యే ముందు వాళ్లు చెప్పేదంతా విందాం. మాట్లాడనిద్దాం, ఎందుకంటే అలా బయటకు వచ్చి మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. మొత్తం విన్నాక దాన్ని బట్టి రియాక్ట్‌ అవుదాం’’ అని పేర్కొన్నారు. ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమా నుంచి దర్శకుడు సాజిద్‌ఖాన్‌ తప్పుకోవడంతో మిగతా పార్ట్‌ను ‘హౌస్‌ఫుల్‌ 3’ కి దర్శకత్వ బాధ్యతలు వహించిన సాజిద్, ఫర్హాద్‌లు డైరెక్ట్‌ చేయనున్నారని లేటెస్ట్‌ బాలీవుడ్‌ టాక్‌. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌ తిరిగి మొదలు కానుందని సమాచారం.

నిరుత్సాహపరిచుంటే సారీ
చాలా మంది మీ నలభై ఏళ్ల సినీ కెరీర్‌లో మీరెప్పుడైనా లైంగిక వేధింపులకు గురయ్యారా? అని అడుగుతున్నారు. నేనెప్పుడూ లైంగిక వేధింపులకు గురవలేదు. మిమ్మల్ని నిరుత్సాహపరిచుంటే క్షమించండి. చిన్నప్పటి నుంచి కూడా విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను. అదే చేశాను’’ అని పేర్కొన్నారు.

మీటూను దుర్వినియోగం చేయకండి
ప్రస్తుతం ‘మీటూ’ ఉద్యమాన్ని కొంత మంది తప్పుగా ఉపయోగుస్తున్నట్టుగా అనిపిస్తోంది. తప్పుడు నిందలు చేయడం కరెక్ట్‌ కాదు. ఒకవేళ ఈ ఉద్యమాన్ని సరిగ్గా వినియోగిస్తే కచ్చితంగా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను’’

– హృతిక్‌ మాజీ భార్య సుసానే ఖాన్‌

‘మీటూ’ ద్వారా బయటకు వచ్చి చెబుతున్న స్త్రీలందరి ధైర్యం మెచ్చుకునేది. ఇండస్ట్రీ స్త్రీల సురక్షిత వాతావరణానికి ఏర్పరిచే ప్రయత్నం చేయాలి. దేశంలోని ప్రతి స్త్రీ ఏదోరకంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారంటే చాలా బాధగా ఉంది’’

– పూజా హెగ్డే

‘‘ఇన్నేళ్లు తమతో దాచుకున్న ఈ చేదు అనుభవాలు గురించి ఇలా బయటకు వచ్చి మాట్లాడటానికి చాలా ధైర్యం కావాలి. ‘మీటూ’ అంటూ ముందుకొచ్చిన అందర్నీ నమ్ముతున్నాను. అలాగే నిజాయతీగా ముందుకు వచ్చిన వాళ్లను సపోర్ట్‌ చేస్తున్న పురుషులందరీకి  నా థ్యాంక్స్‌’’
– సయేషా

‘‘అసలు జరగకపోవడం కంటే కొంచెం ఆలస్యం అయినా ఫర్వాలేదు. ఇప్పుడు ఈ స్టెప్‌ తీసుకుంటే భవిష్యత్తులో ఈ వేధింపులను కంట్రోల్‌లో ఉంచొచ్చు’’
– మలైకా అరోరాఖాన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా