‘నా కోపానికి ఓ లెక్కుంది’

28 Nov, 2019 15:07 IST|Sakshi

ముంబై : ఏ అంశంపైనైనా బోల్డ్‌గా మాట్లాడే బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ తన ఆగ్రహం అర్ధవంతమైందని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ తనకు పట్టరాని కోపం వచ్చినా అది నిర్మాణాత్మకంగా ఉంటుందని తనకు ఓ విజన్‌, ప్రణాళిక ఉందని స్పష్టం చేశారు. మనల్ని వెనక్కి లాగే పద్ధతులకు తాను వ్యతిరేకమని, అవి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోవని..తాను ఎప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసినా అది తన మంచికే దారితీసిందని కంగనా అన్నారు. తనలో చిన్న పిల్లల మనస్తత్వం ఉందని అది ఎవరి లాజిక్‌కూ అందదని వ్యాఖ్యానించారు.

తాను డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తానని అందరూ అనుకుంటారని కాని తాను వాటిని తెలివిగా వెచ్చిస్తానని చెప్పారు. తాను ప్రేమించే వారి కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడనని అన్నారు. తన మనసుకు దగ్గరైన సామాజిక​ కార్యక్రమాలకూ తాను ఖర్చు చేస్తానని కంగనా చెప్పారు. ఇక తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ తలైవిలో కంగనా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా