జయలలిత.. అచ్చం ఐశ్వర్యరాయ్‌లా!

3 Feb, 2020 08:25 IST|Sakshi

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. బాలీవుడ్‌ సంచలన హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది. చిత్రబృందం సినిమాలో కంగనా లేటెస్ట్‌ లుక్‌ను ఆదివారం విడుదల చేసింది. అందులో ఈ హీరోయిన్‌ సాంస్కృతిక నృత్యకారిణిగా ఆకట్టుకున్నారు. ఇక ఈ చిత్రం కోసం ఆమె క్లాసికల్‌ డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ సైతం తీసుకున్నారు. జయ లలిత పాత్రను పోషించడం కోసం పెద్ద పరిశోధనే చేసానంటుందీ కంగనా. జయలలిత నాలా ఉండదు. బాలీవుడ్‌లో ఐశ్వర్యరాయ్‌ అంత అందంగా ఉంటుందో..ఆమె కూడా అంతే అందంగా ఉంటుంది. అలాంటిది ఆమె పాత్రలో నటించడం నాకు చాలా పెద్ద చాలెంజ్‌ అనిపించింది. ఎందుకంటే నేను గ్లామరస్‌ స్టార్‌ను కాదు.(పంగా రివ్యూ: మహిళలు, అస్సలు మిస్సవకండి)

కాకపోతే ఆమెకు నాకు ఉన్న ఒకే ఒక పోలిక.. అనుకోకుండా నటి కావడం. సినిమాలంటేనే ఇష్టముండని జయలలిత అనూహ్యంగా వెండితెరపై కనిపిస్తుంది. నేనూ అంతే. సినిమాల్లో కనిపించాలని ఎప్పుడూ కలలు కనలేదు. అందుకే మేము అసాధారణ నటీమణులుగా కీర్తి గడించా’మని చెప్పుకొచ్చింది. మరో విషయంలోనూ వీరిద్దరికీ పోలిక ఉందంటోంది పంగా హీరోయిన్‌. ‘సినిమాల్లో గ్లామర్‌ పాత్రలు చేస్తూ ఉండటం కన్నా అంతకు మించి మరేదో ఉందని జయలలిత ఎప్పుడూ అనుకునేదేమో. అందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టి శక్తివంతమైన నాయకురాలిగా మారింది. ఇక నా విషయానికొస్తే.. కేవలం నటిగా కొన్ని పరిమితుల్లోనే ఉండటం ఎందుకని, నిర్మాతగానూ మారాను’ అని కంగనా పేర్కొంది. ‘తలైవి’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్‌ 26న విడుదల కానుంది.

చదవండి: 

కంగనా నిర్మాతగా ‘అపరాజిత అయోధ్య’

కంగనాకు పూలగుచ్ఛం పంపిన అలియా భట్‌!

అమ్మ ఆస్తులకు కుమ్ములాట

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా