ఫోర్బ్స్‌పై కంగన సోదరి ఫైర్‌

20 Dec, 2019 11:55 IST|Sakshi

బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగన రనౌత్‌ సోదరి రంగోలీ చందేల్‌ ఫోర్బ్స్‌ ఇండియా పత్రికపై విరుచుకుపడ్డారు. ఫోర్బ్స్‌ ఇండియా విడుదల చేసిన సెలబ్రిటీల గణాంకాలన్ని తప్పుడు గణాంకాలంటూ సోషల్‌ మీడియాలో ధ్వజమెత్తారు. ఈ జాబితాలో పేర్కొన్న సెలబ్రిటీల ఆదాయానికి రుజువులు కావాలని డిమాండ్‌ చేశారు. కాగా ఫోర్బ్స్‌ ఇండియా 2019 సంవత్సరంలో అత్యధిక ఆదాయాన్ని గడించిన ప్రముఖ 100 మంది  సెలబ్రిటీల వార్షిక ఆదాయ గణాంకాలను విడుదల చేసింది. కంగన ఈ ఏడాది రూ.17.5 కోట్లు సంపాందించి 70వ స్థానంలో ఉన్నట్లు  ఫోర్బ్స్‌ పేర్కొంది.  

ఈ విషయంపై రంగోలీ చందేల్‌ స్పందిస్తూ.. ‘అవును.. ఫోర్బ్స్‌ ఇండియా గణాంకాలు అన్ని మోసపూరితమైనవి. వారి మాగజైన్‌లో పేర్కొన్న ప్రతి ఒక్క సెలబ్రిటీల ఆదాయాన్ని నిరూపించాలి. మీకు తెలుసా.. కంగన ఈ జాబితాలో పేర్కొన్న ఆదాయం కంటే ఎక్కువగానే ట్యాక్స్‌ కడుతుంది. ఆదాయాన్ని ఏ ప్రాతిపదికన అంచనా వేశారో మాకు చూపించండి’ అంటూ ఫోర్బ్స్‌ ఇండియాకు ఆమె సవాలు విసిరిరారు. అదేవిధంగా ఈ విషయంలో సరైన రుజువులు చూపిస్తే తాను బహిరంగ క్షమాణలు అడగడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కోన్నారు. దీనిపై ఫోర్బ్స్‌ ఇండియా వేంటనే సమాధానం ఇవ్వాలంటూ రంగోలీ తన ట్విటర్‌లో రాసుకొచ్చారు. ‘ఈ ఏడాది కంగనా ఎంత ఆదాయాన్ని గడిచిందో తనకే తెలియదు. తన ఆదాయానికి సంబంధించిన ప్రతి విషయం నాకు, అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌కు మాత్రమే తెలుసు. ఈ విషయం చాలా గోప్యంగా ఉంటుంది. ఇంకా ఆర్థిక సంవత్సరం ముగియక ముందే వారికి ఆదాయ వివరాలు ఎలా వచ్చాయ’ని ప్రశ్నించారు రంగోలీ.  

కాగా ఈ జాబితా ప్రకారం, బాలీవుడ్‌ ‘కిలాడి’ అక్షయ్ కుమార్ ఈ సంవత్సరంలో రూ. 293.25 కోట్ల ఆదాయంతో 2వ స్థానంలో నిలిచి... గత మూడేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న సల్మాన్ ఖాన్‌ను అధిగమించారు. అలాగే అలియా భట్ 8, దీపికా పదుకొనే 10వ స్థానంలో నిలిచి టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. ఇక టాప్ 10లో ఉన్న మరో బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్ 6, రణవీర్ సింగ్ 7వ స్థానంలో ఉన్నారు. (సినిమా స్టార్లను వెనక్కునెట్టిన విరాట్‌ కోహ్లి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా