ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌గా కంగనా.. అభిమానులు సెల్యూట్‌..

17 Feb, 2020 13:11 IST|Sakshi

ముంబై :  బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ఇటీవల నటించిన ‘పంగా’ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. మహిళా కబడ్డీ మాజీ చాంపియన్‌ జయా నిగమ్‌ నిజజీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమాలోని కంగన నటకు మంచి మార్కులే పడినప్పటికీ మూవీ కమర్షియల్‌గా హిట్‌ సాధించలేకపోయింది. ఇటీవల కంగనా నటించిన క్వీన్‌ సినిమాకు పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కంగనా ‘తలైవి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు‌. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఎంజీఆర్‌గా అరవిందస్వామి కనిపించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతుండగానే మరో సినిమాకు కంగనా ఓకే చెప్పారు.  

సర్వేశ్‌ మేవర దర్శకత్వంలో రూపొందుతున్న ‘తేజస్‌’ మూవీలో కంగనా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఇందులో యుద్ధ విమానం నడిపే పైలెటగా ఆమె కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేశారు. ఇందులో ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌గా కనిపిస్తున్న కంగనా లుక్‌కు అభిమానులు ఫిదా అవుతూ..ఆమెకు సెల్యూట్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలోని తన నటనతో  కంగనా మరోసారి అద్భుతమైన నటిగా రుజువు చేసుకోనున్నారని అభిమానులు అభిపప్రాయపడుతున్నారు. రోనీ స్క్రూవాలా ప్రొడక్షన్‌లో వార్‌ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 

For all the brave hearted and strong headed women in Uniform who make sacrifices for our nation day in and day out .... Kangana to  play an airforce pilot in her next , titled - #TEJAS . . #KanganaRanaut @team_kangana_ranaut #RonnieScrewvala @sarveshmewara @nonabains @rsvpmovies

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

మరిన్ని వార్తలు