సిస్టరాఫ్‌ పద్మావతి

7 Feb, 2018 00:05 IST|Sakshi
కంగనా రనౌత్‌

మణికర్ణిక 

రియల్‌గా కాదు లెండి. ఆ సంగతి మీకూ తెలుసు. పద్మావతికి మణికర్ణిక.. సిస్టర్‌ ఎందులోనంటే.. షూటింగ్‌ కష్టాలను ఈదడంలో! ఎడారిలో ఉండేది ఇసుక కదా, మరి ఈదడం ఏమిటి? రాజస్థానీలు అంతేలా ఉంది. చరిత్ర జోలికి వస్తే ఇసుకలో కూడా ఈత కొట్టించేసేయడం వారి ‘ఆచారం’ లా ఉంది! పద్మావతి షూటింగ్‌లో సెట్లూ అవీ పాడు చేశారు కదా. ఇప్పుడు ‘మణికర్ణిక’ సెట్‌లను అసలే వేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఝాన్సీరాణీ జీవిత కథనే ‘మణికర్ణిక’గా మన తెలుగు డైరెక్టర్‌ ‘క్రిష్‌’ హిందీలో తీస్తున్నారు. మణికర్ణికగా కంగనా రనౌత్‌ నటిస్తున్నారు. ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం రాజస్థాన్‌ వచ్చి, ఎక్కడ సెట్టింగులు వేస్తారోనని అక్కడి ‘సర్వ బ్రాహ్మిన్‌ మహాసభ’ కార్యకర్తలు కర్రలు పట్టుకుని నిలుచుంటున్నారు.

చరిత్రను వక్రీకరించే వారి ప్రయత్నాలను అడ్డుకోవాలని మహాసభ అధ్యక్షుడు రాజస్థాన్‌ ప్రభుత్వానికి ఇప్పటికే ఒక విజ్ఞప్తిని పంపారు. ఇవాళ (బుధవారం) కూడా ప్రభుత్వం స్పందించకపోతే రాజస్థాన్‌ గవర్నర్‌ కల్యాణ్‌సింగ్‌నీ, హోమ్‌ మినిస్టర్‌ గులాబ్‌ చంద్‌ కటారియాను కలవాలని నిర్ణయించుకున్నారు. రాణీ లక్ష్మీబాయికి, ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్‌ ఏజెంటుకు మధ్య లవ్‌ సీక్వెన్స్‌ లాంటిదేదో సినిమాలో ఉంటుందని వాళ్ల చెవిన పడిందట. అందుకే షూటింగ్‌ని జరగనివ్వకూడదని గట్టిగా డిసైడ్‌ అయినట్లున్నారు. పద్మావతి షూటింగ్‌ సమయంలో కూడా అక్కడి కర్ణిసేనవాళ్లకు ఇలాంటి డౌటే వచ్చింది.. పద్మావతి, ఖిల్జీల మధ్య దర్శకుడు భన్సాలీ తన క్రియేటివిటీతో లవ్‌ని రాజేస్తాడేమోనని! అలాంటిదేమీ లేదని పద్మావతి రిలీజ్‌ తర్వాత తేలింది కదా.. అంటే, ‘ముందే అభ్యంతరం చెప్పబట్టి.. భన్సాలీ ఆ సీన్‌ని పెట్టలేదు’ అని కర్ణిసేన వాదించింది. చూస్తుంటే.. మణికర్ణికకు కూడా కష్టాలు, బాలారిష్టాలు తప్పేలా ల

మరిన్ని వార్తలు