కరోనా: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నిర్మాత

9 Jul, 2020 13:30 IST|Sakshi

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు-నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పలు హిట్‌ చిత్రాలను నిర్మించిన ఆయన శ్యాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. వృత్తిరీత్యా డాక్టరైన వెంకటేష్ కుమారుడు డాక్టర్ అభిలాష్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తన తండ్రి ఆరోగ్యాన్ని అభిలాష్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. శ్వాస సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా సోకి ఉంటుందని శాండల్‌వుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల రాజకీయ ప్రవేశం చేసిన రాక్‌లైన్‌ దివంగత నటుడు అంబరీశ్ స్మారకం నిర్మాణంపై చర్చించేందుకు  ఆయన భార్య, ఎంపీ సుమలతో కలిసి సీఎం యెడియూరప్పను కలిశారు. (చదవండి: సీనియర్‌ నటికి కరోనా పాజిటివ్‌!)

సమలతకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఇటీవల ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ మధ్యకాలంలో సుమలతను కలిసినందున ఆయనకు కూడా కరోనా వచ్చి ఉండొచ్చని అందరూ అభిప్రాయ పడుతున్నారు. కానీ వెంకటేష్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారా లేదా అనే విషయంపై ఇప్పటి వరకు డాక్టర్లు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ప్రస్తుతం రాక్‌లైన్‌ కన్నడ సూపర్‌ స్టార్‌ దర్శన్‌ రాజవీర మడకారి నాయక అనే పిరియాడికల్‌ డ్రామా చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ తెలుగు చిత్రాలను ఆయన కన్నడలో రీమేక్ చేశారు. తెలుగులో రవితేజతో ‘పవర్’ సినిమా నిర్మించారు. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘బజరంగీ భాయీజాన్’‌కు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. రజనీకాంత్ ‘లింగా’ సినిమాను ఆయనే నిర్మించారు. రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’లో ఆయన మైసూర్ ఎస్పీగా కనిపించిన విషయం తెలిసిందే. (చదవండి: కరోనాతో హీరో తండ్రి మృతి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా