శాండల్‌వుడ్ సీనియర్‌ నటి కన్నుమూత

22 Mar, 2019 10:48 IST|Sakshi

ప్రముఖ కన్నడ సినీ నటి ఎల్‌వీ శారద (78) గురువారం బెంగళూరులో కన్నుమూశారు. వంశవృక్ష సినిమా ద్వారా కన్నడ సినీ రంగంలో అడుగుపెట్టిన ఆమె, తొలి సినిమాతోనే రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా అందుకున్నారు. ఆ తరువాత అనేక సినిమాలో ఆమె రాణించారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక చిత్రాల్లో తన ప్రతిభను చాటారు. శంకరాచార్య, మధ్వాచార్య, నక్కళారాజకుమారి, ఒందు ప్రేమ కథ సినిమాలలో నటించారు. వెండి తెరకు దూరమైన తరువాత పలు డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకతక్వం వహించారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న బెంగళూరులోని శంకర హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

మరిన్ని వార్తలు