మహేశ్‌ బాబుపై అభిమానుల ఫైర్‌

19 Oct, 2018 16:32 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా, సింపుల్‌గా ఉండే మహేష్‌కు వివాదాల బెడద తప్పటంలేదు. ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా అప్‌డేట్‌గా ఉంటున్నారు. తన ఆలోచనలను అభిమానులతో పంచుకుంటూ, వారికి అందుబాటలో ఉంటున్నారు. అంతేకాకుండా తన సినిమాల అప్‌డేట్‌ గురించే కాకుండా, ఇతర హీరోలు, దర్శకుల చిత్రాలు, వాటిపై అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.  అందుకే చాలా తక్కువ సమయంలోనే దాదాపు ఏడు మిలియన్‌(70 లక్షల) మంది ట్వీటర్‌లో మహేశ్‌ను ఫాలో అవుతున్నారు. ఇక  సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన సందేశంలోగాని, ఫోటోల విషయంలో ఏమాత్రం పొరపాటు ఉన్నా అభిమానులు కడిగిపారేస్తున్నారు.

తాజాగా అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ సూపర్ స్టార్‌ ట్వీట్‌ చేశారు. అయితే మహేశ్‌ తెలుగు, తమిళం, మలయాలం, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లోనే శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై కన్నడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని భాషలకు సమానమైన ప్రాముఖ్యత ఇవ్వండని, ఎక్కువగా అభిమానులున్న కన్నడకు కూడా కాస్త గౌరవం ఇవ్వడంటూ మహేష్‌కు సూచించారు. దీంతో పొరపాటును గుర్తించిన మహేశ్‌ బాబు కన్నడ భాషను కూడా చేరుస్తూ మరోసారి అభిమానలకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో కూడా ‘భరత్‌ అనే నేను’చిత్రం ఘన విజయం సాధించడంతో అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ట్వీట్‌లో కూడా కన్నడ భాష లేదు. అప్పుడు కూడా కన్నడ అభిమానులు ఆగ్రహించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నారు మహేశ్‌బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయాలనుకుంటున్నారు.

>
మరిన్ని వార్తలు