చిరంజీవి సర్జా ఇంట మరో చేదు వార్త..

15 Jul, 2020 19:28 IST|Sakshi

బెంగళూరు: చిత్ర పరిశ్రమల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకు మహమ్మారి బారిన పడుతున్న నటీనటుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఉత్తరాది, దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా కన్నడ హీరో చిరంజీవి సర్జా సోదరుడు హీరో ధ్రువ సర్జా ఆయన భార్య ప్రేరణ శంకర్‌లు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ధ్రువ సర్జా సోషల్‌ మీడియాలో వేదికగా ప్రకటించాడు. వారిలో తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్‌ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చినట్లు బుధవారం ట్వీట్‌ చేశాడు. (చదవండి: ‘నువ్వు లేకుండా ఉండలేం.. వచ్చేయ్‌’)

‘నాకు, నా భార్యకు పాజిటివ్‌ వచ్చింది. మాలో తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నందున బెంగుళూరులోని ఆసుపత్రిలో చేరాలని నిర్ణయించుకున్నాం. మేము త్వరలోనే కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తామని ఆశిస్తున్నాను. అయితే గత కొద్దిరోజులుగా ఎవరైతే మమ్మల్ని కలిశారో వారంతా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అంటూ ధ్రువ ట్వీట్‌ చేశాడు. ఆయన సోదరుడు హీరో చిరంజీవి సర్జా జూన్‌ 7వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. చిరంజీవి సర్జా మరణంతో విషాదంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ఇది మరో చేదు వార్త. (చదవండి: కరోనా: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నిర్మాత)

మరిన్ని వార్తలు