ఎన్టీఆర్ సినిమాలో వివాదాస్పద నటుడు

6 Apr, 2017 11:08 IST|Sakshi
ఎన్టీఆర్ సినిమాలో వివాదాస్పద నటుడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ కాస్టింగ్ను సెట్ చేస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్లుగా రాశీఖన్నా, నివేదా థామస్ లను ఫైనల్ చేయగా, అతిథి పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత కనిపించనుందన్న ప్రచారం జరుగుతోంది. విలన్ పాత్రకు కన్నడ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారు జై లవ కుశ యూనిట్.

కన్నడ ఇండస్ట్రీలో వివాదాస్పద నటుడిగా పేరుతెచ్చుకొని, ప్రస్తుతం బ్యాన్ ఎదుర్కొంటున్న దునియా విజయ్.. జై లవ కుశ సినిమాలో విలన్గా నటించనున్నాడు. ఓ సినిమా షూటింగ్లో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఇద్దరు నటులు ప్రాణాలు కొల్పొవడానికి కారుకులైన దునియా విజయ్, ఆయన సినిమా యూనిట్పై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించింది. గతంలోనూ విజయ్ పలు వివాదాల్లో తలదూర్చాడు. ఇతర నటీనటులతో దురుసుగా మాట్లాడటం చేయి చేసుకోవటం లాంటి ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి.

ఎన్టీఆర్కు కన్నడ ఇండస్ట్రీతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమాలో ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడాడు. అదే పరిచయాలతో దునియా విజయ్ని తన సినిమాలో విలన్గా నటింప చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కన్నడలో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ విలన్గా నటిస్తే జై లవ కుశకు సాండల్వుడ్ మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి