‘కనులు కనులను దోచాయంటే’ ట్రైలర్‌ అదుర్స్‌

18 Feb, 2020 20:00 IST|Sakshi

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌, 'పెళ్లి చూపులు' ఫేమ్‌ రీతువర్మ జంటగా నటించిన మలయాళీ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ 'కణ్ణుమ్‌ కణ్ణుమ్‌ కొళ్లైయాడిత్తాల్'. తెలుగులో 'కనులు కనులను దోచాయంటే' పేరుతో విడుదలవుతోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ కీలక పాత్రలో నటించారు.  దేసింగ్‌ పెరియసామి దర్శకత్వంలో వయాకం 18 స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు హక్కులను దక్కించుకుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌, పాటలు, తమిళ ట్రైలర్‌  ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. తాజాగా విడుదలయిన ట్రైలర్‌ మరింత ఆకట్టుకునేలా ఉంది. 

(చదవండి : ‘గుండె గిల్లి ప్రాణం తీయొద్దే’)

హీరో, అతని స్నేహితుడు లగ్జరీ లైఫ్‌ స్టైల్‌కు అలవాటుపడిన యువకులని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది.  లగ్జరీ లైఫ్‌ కోసం వాళ్లు చేసిన పనులు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టాయి. దాని నుంచి ఎలా బయటపడ్డారు అనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్‌ ద్వారా చూపించారు. 

‘ఇండియాలో ఆన్‌లైన్‌ ట్రేడ్‌కి వన్‌ ఇయర్‌ వర్త్‌  ఎంతో తెలుసా? రెండు లక్షల కోట్లు. సుమారు 10 కోట్లమంది ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారు. మనం వెతికేవాడు ఆ పది కోట్లలో ఒక్కడు’  హీరో చెప్పే డైలాగ్‌లో ట్రైలర్‌ మొదలైంది. ‘మేం చేసిన బుర్ర తక్కువ పని లవ్‌ చేయడం’, ‘ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా.. గోవిందా’  అని హీరో, అతని స్నేహితులు చెప్పే కామెడీ డైలాగులలో ట్రైలర్‌ ముగిసింది. 

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘కనులు కనులను దోచాయంటే’ ట్రైలర్‌

మరిన్ని వార్తలు