స్టార్‌ కమెడియన్‌కు అభిమానుల బిగ్‌ సర్‌ప్రైజ్‌

30 Jan, 2020 15:51 IST|Sakshi

తమ అభిమాన నటుడు వస్తున్నాడంటే ఫ్యాన్స్‌ సందడి అంతా ఇంతా ఉండదు. ఇక ఆ కార్యక్రమం అభిమాన నటుడికి సైతం చిరకాలం గుర్తుండిపోవాలని కొంతమంది అభిమానులు ఓ ఐడియా వేశారు. అది చూసిన బాలీవుడ్‌ ప్రముఖ కమెడియన్‌, నటుడు, వ్యాఖ్యాత కపిల్‌ శర్మకు ఆనందంతో నోట మాట రానంత పనైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘ద కపిల్‌ శర్మ షో’ టీమ్‌ తొలిసారిగా విదేశాల్లో లైవ్‌ ప్రోగ్రాంను ఏర్పాటు చేసింది. దీనికోసం కపిల్‌, తన తల్లిని వెంటబెట్టుకుని టీమ్‌తో సహా దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడ లైవ్‌ ప్రోగ్రాంకు హాజరైన అభిమానులు ఈ కమెడియన్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

కపిల్‌ ముద్దుల కూతురు అనైరా ఫొటోలు ఉన్న టీషర్టులతో కార్యక్రమానికి హాజరయ్యారు. అది చూసిన ఈ కమెడియన్‌ అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. మీరందరూ ఎప్పటికీ నా హృదయంలో ఉంటారంటూ దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అందులో చాలామంది యువతీయువకులు బ్లాక్‌ టీ షర్ట్‌పై అనైరా చిత్రం ఉన్న దుస్తులను ధరించి ఉన్నారు. కాగా కపిల్‌ శర్మ- గిన్ని చత్రత్‌ దంపతులకు అనైరా గతేడాది డిసెంబర్‌ 10న జన్మించింది. ఇక దుబాయ్‌ పర్యటనలో ఉన్న ఈ నటుడు తన గారాలపట్టి ఆడుకోడానికి ఓ గిటార్‌ను సైతం కొనుగోలు చేశాడు.

చదవండి: అమ్మాయి పుట్టింది: కపిల్‌ శర్మ

కూతురి ఫొటో షేర్‌ చేసిన స్టార్‌ కమెడియన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా