కరోనాను ఓడించగలం

26 May, 2020 23:59 IST|Sakshi

తన ఇంట్లో పని చేసే సిబ్బందిలో ఇద్దరికి కరోనా వైరస్‌ సోకినట్లు వెల్లడించారు బాలీవుడ్‌ దర్శక – నిర్మాత కరణ్‌ జోహార్‌. ‘‘మా ఇంటి సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వెంటనే మా భవనంలోని ఓ ప్రత్యేక గదిలో వారిని ఉంచి సంబంధిత అధికారులకు సమాచారం అందించాం. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు, మా ఇతర సిబ్బంది.. అందరం కరోనా పరీక్ష చేయించుకున్నాం. నెగటివ్‌ వచ్చింది. అయినప్పటికీ మేమందరం 14 రోజుల పాటు సెల్ఫ్‌ ఐసొలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే కరోనా బారిన పడ్డ మా సిబ్బంది బాగోగులను చూసుకుంటాను. వారు త్వరలోనే కోలుకుంటారన్న నమ్మకం ఉంది. కరోనా బారినపడకుండా మనమందరం జాగ్రత్తలు తీసుకోవాలి. అందరం ఇళ్లలోనే ఉందాం. సామాజిక దూరాన్ని పాటిస్తూనే అందరం కలిసికట్టుగా ఈ వైరస్‌ను ఓడించగలమని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు కరణ్‌ జోహార్‌. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు