చీప్‌ పబ్లిసిటీ స్టంట్..బాలీవుడ్‌ సిగ్గుపడు!

9 Jul, 2020 16:30 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌‌ ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటనలో ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ చర్యలతో కరణ్‌ తీవ్రంగా కలత చెందాడని.. ఏడుస్తూనే ఉన్నాడని అతడి సన్నిహితుడు ఒకరు మీడియాకు వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కూడా నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా ఇంకా చీప్‌ పబ్లిసిటీ స్టంట్‌లు మానరా అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. అభిమానులు ఇంతలా మండిపడటానికి కారణం ఉంది. ఏంటంటే బుధవారం నీతూ కపూర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలకు కరణ్‌ జోహార్‌ హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అవి కాస్త కరణ్‌జోహార్‌ స్నేహితుడి వ్యాఖ్యల తర్వాత పబ్లిష్‌ అయ్యాయి. దాంతో అడ్డంగా బుక్కయ్యి విమర్శల పాలవుతున్నాడు కరణ్‌ జోహార్‌. (సల్మాన్‌, కరణ్‌లపై పిటిషన్‌ కొట్టివేత)

ఈ ఫోటోలు చూసిన నెటిజనులు ‘ఓ పాపం కరణ్‌ జోహార్‌ మాట్లాడే పరిస్థితుల్లో లేడు. అతడి స్నేహితుడు కాల్‌ చేసిన ప్రతిసారి అతడు ఏడుస్తూనే ఉన్నాడు. అదే నిజమయితే.. నీతూ కపూర్‌ పుట్టినరోజు వేడుకలకు హాజరై.. నవ్వుతూ ఎంజాయ్‌ చేసిన వ్యక్తి ఎవరు. మళ్లీ చీప్‌ ప్లబ్లిసిటీ స్టంట్‌ ప్లే చేశారు. బాలీవుడ్‌ సిగ్గుపడు’ అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

సుశాంత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో పాతుకుపోయిన బంధుప్రీతి గురించి మరోసారి చర్చకు వచ్చింది. ఈ క్రమంలో నెటిజనులు కరణ్‌ జోహార్‌, ఆలియా భట్‌,  సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్, సల్మాన్ ఖాన్‌లను తీవ్రంగా ట్రోల్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు