బ్లాక్‌బస్టర్‌ ఫొటో!

28 Sep, 2018 06:24 IST|Sakshi
పార్టీలో సరదాగా ఓ సెల్ఫీ

బాలీవుడ్‌లో బడా స్టార్స్‌ అందర్నీ ఒక ఫ్రేమ్‌లోకి తీసుకురావాలంటే ఫస్ట్‌ వినిపించే పేరు కరణ్‌ జోహార్‌. తాజాగా మరోసారి బాలీవుడ్‌ టాప్‌ యాక్టర్స్‌ అందర్నీ ఒకే ఫ్రేమ్‌లో తీసుకొచ్చారు. అయితే ఈ సారి సినిమా కోసం కాదు. జస్ట్‌ చిన్న పార్టీ కోసం. రణ్‌బీర్‌ కపూర్‌ ఏర్పాటు చేసిన చిన్న పార్టీలో షారుక్, ఆమిర్, దీపికా పదుకోన్, కరణ్, రణ్‌వీర్, ఆలియా భట్‌ పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఈ ఫొటో క్లిక్‌ మనిపించారు. ఈ ఫొటోను షేర్‌ చేసి ‘అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌ ఫొటో’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. షారుక్, ఆమిర్‌ ఒకే ఫంక్షన్‌కి హాజరు కావడం, మాజీ ప్రేమికులు దీపికా, రణ్‌బీర్‌లు కూడా ఫొటోకి నవ్వుతూ పోజులివ్వడం విశేషం.
 

మరిన్ని వార్తలు