అక్షయ్‌ను హెచ్చరించిన కరీనా!

14 Apr, 2018 15:17 IST|Sakshi

సెలబ్రిటీలు ఏం చేసినా ఓ కన్ను కనిపెడుతూనే ఉంటుంది. అలాంటిది సెలబ్రిటీల పిల్లలంటే మీడియా ఫోకస్‌ అంతా వారిపైనే ఉంటుంది. సోషల్‌ మీడియాలో సెలబ్రిటీల కంటే వారి పిల్లలే ఎక్కువగా ట్రెండ్‌ అవుతుంటారు. ఇలాంటి లిస్ట్‌లో మొదటిగా చెప్పుకోవాల్సింది తైమూర్‌ అలీ ఖాన్‌. పుట్టిన రోజు నుంచే సెలబ్రిటీగా మారిన తైమూర్‌.. తన క్యూట్‌ చిక్స్‌తో ఎంతో మందిని ఆకర్షించాడు. తైమూర్‌కు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది.

అయితే తాజాగా...కరీనా కపూర్‌, అక్షయ్‌కుమార్‌ను హెచ్చరించింది. అది కూడా తైమూర్‌ విషయంలో. అక్షయ్‌ను ఉద్దేశిస్తూ...‘తైమూర్‌ వల్ల నీకు ముప్పు ఉంది. నీకు ఉన్న అభిమాన గణాన్ని తైమూర్‌ దాటేయగలడు. ఇది నా ఓపెన్‌ ఛాలెంజ్‌’ అంటూ ఓ కార్యక్రమంలో పేర్కొంది. ప్రస్తుతం కరీనా ‘వీరే ది వెడ్డింగ్‌’ షూటింగ్‌లో బిజీగా ఉంది.

ఇక, మీడియాలో తన తనయుడిపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ఇప్పుడు తన కుమారుడి వయస్సు 14 నెలలు మాత్రమేనని, కానీ తనకు సంబంధించిన ప్రతి ఫొటో బయటికి ఎలా వస్తుందో తెలియడం లేదన్నారు. బాబు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ డ్రెస్‌ ధరించాడు, హెయిర్‌ స్టైల్‌ ఎలా ఉంది వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతుందని ఆమె తెలిపారు. ఇది హర్షణీయం కాదన్నారు. మీడియా తనని అంతలా ఫాలో అవుతుంటే, ఎలా అదుపు చెయ్యాలో కూడా తెలియడం లేదన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా