ముచ్చటగా మూడోసారి...

23 Jun, 2019 06:18 IST|Sakshi

... స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు ఆమిర్‌ ఖాన్, కరీనా కపూర్‌. అమిర్‌ హీరోగా ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ మూవీ ఫేమ్‌ అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో ‘లాల్‌సింగ్‌ చద్దా’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతుల్‌ కులకర్ణి స్టోరీ అందించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కరీనా కపూర్‌ను అనుకుంటున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలే నిజమయ్యాయి. ఈ చిత్రంలో కరీనా కపూర్‌ హీరోయిన్‌గా నటించనునున్నారని చిత్రబృందం అధికారికంగా తెలిపింది. ఇంతకుముందు త్రీ ఇడియట్స్, తలాష్‌ సినిమాల్లో కలిసి నటించారు అమిర్‌ అండ్‌ కరీనా. ఇప్పుడు కమిట్‌ అయిన ‘లాల్‌సింగ్‌ చద్దా’ మూడో సినిమా. హాలీవుడ్‌ ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కి ఇది హిందీ రీమేక్‌. ఈ సినిమా కాకుండా ‘అంగ్రేజీ మీడియం’ చిత్రంలో నటిస్తున్నారు కరీనా కపూర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు