బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ అరుదైన ఫొటో షూట్లో పాల్గొంది. ప్రెగ్నెన్సీతో ఉన్న కరీనా బ్లాక్ ఫ్యాంట్, టీ షర్టుతోను, తెల్లటి డ్రెస్ ధరించి వేర్వేరుగా ఫొటోలకు పోజిచ్చింది. అన్ని ఫొటోల్లో కరీనా తన కడుపులోని బిడ్డను ప్రేమతో తాకుతున్నట్టుగా కనిపించింది.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడిన కరీనా త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. కాగా సైఫ్, కరీనా మొదట్లో ఈ విషయాన్ని గోప్యతగా ఉంచారు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా ఆమె షూటింగ్లలో పాల్గొంది. తన ఫొటోలు మీడియా కంట పడకుండా జాగ్రత్త పడింది. తర్వాత ఈ జోడీ ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించడంతో పాటు తమకు పుట్టబోయే బిడ్డకు పెట్టే పేరు గురించి తమ అభిప్రాయాన్ని అభిమానులకు తెలియజేశారు. తాజాగా కరీనా ఫొటో షూట్లో పాల్గొంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. గతంలో కొందరు హాలీవుడ్ హీరోయిన్లు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మరో అడుగు ముందుకు వేసి నగ్నంగా ఫొటో షూట్లో పాల్గొన్నారు.