‘నీలం కళ్లు, ఉంగరాల జుట్టు ఉంటే తైమూరేనా’

25 Feb, 2019 15:09 IST|Sakshi

బాలీవుడ్‌ జంట సైఫ్‌ అలీఖాన్‌ - కరీనా కపూర్‌ కుమారుడు తైమూర్‌ అలీ ఖాన్‌కు ఎంతటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీడియా నిత్యం తైమూర్‌ ఎక్కడికి వెళ్లాడు? ఎలాంటి దుస్తులు వేసుకున్నాడు? ఎలాంటి ఆటలు ఆడుతున్నాడు? అంటూ చిన్న నవాబ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్‌ చేస్తుంటుంది. ఈ క్రేజ్‌ ఎంతలా పెరిగిందంటే.. కొన్ని రోజుల క్రితం కేరళలోని ఓ బొమ్మల షాప్‌లో తైమూర్‌ను పోలి ఉన్న బొమ్మలను అమ్మాకానికి పెడితే అవి కూడా హాట్‌కేకుల్లాగా అమ్ముడయినట్లు సమాచారం. తైమూర్‌ను పోలిన బొమ్మకు కూడా ఇంతటి క్రేజ్‌ రావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. కరీనా కపూర్‌ మాత్రం మండిపడుతున్నారు.

ఈ విషయం గురించి కరీనా మాట్లాడుతూ.. ‘ఇలా చెబుతున్నందుకు సారీ. తైమూర్‌పై మీడియా నిఘా ఎక్కువగా ఉంది. ఎక్కడికి వెళ్లినా ‘తైమూర్‌’.. ‘తైమూర్‌’ అంటూ పిలుస్తారు. తనకు ఇవేం తెలియవు కాబట్టి వాడు సంతోషంతో కేరింతలు కొడతాడు. కానీ నా కొడుకును మామూలు పిల్లలానే పెంచాలనుకుంటున్నాను. మా అబ్బాయిని మీడియా నుంచి దూరంగా ఉంచడానికి మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం. నా కుమారుడిని బయటికి పంపించకుండా, ఆడుకోనివ్వకుండా అదుపుచేయలేను. కానీ తైమూర్‌ ఫొటోలు తీయొద్దని మీడియా వర్గాలకు మాత్రం చెప్పగలను. ఇక బొమ్మ విషయానికొస్తే.. నీలం కళ్లు, రింగుల జుట్టు ఉన్నంత మాత్రాన ఆ బొమ్మ నా కుమారుడి ప్రతి రూపం అవ్వదు’ అని పేర్కొన్నారు కరీనా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా