అమ్మో!.. ఆమె బ్యాగు అంత ఖరీదా!

14 Jan, 2020 15:49 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఖాన్‌ తాజా చిత్రం ‘గుడ్‌న్యూస్‌’. ఈ సినిమా విడుదలై బీ-టౌన్‌లో భారీ కలెక్షన్‌లను రాబట్టిన విషయం తెలిసిందే. నాలుగు పదుల వయస్సుకు చేరువవుతున్నప్పటికీ.. కరీనా నేటితరం హీరోయిన్‌లకు దీటుగా సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా వెలుగుతున్నారు. అందంలోనూ, స్టైల్‌లోనూ సరికొత్త ట్రెండ్‌ ఫాలో అవుతూ యువ హీరోయిన్లతో పోటీపడుతున్నారు. కాగా న్యూయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం కరీనా తన భర్త సైఫ్‌ అలీఖాన్‌, ముద్దుల తనయుడు తైమూర్‌, సోదరి కరిష్మా కపూర్‌లతో కలిసి లండన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. విదేశాలలో సరదాగా గడిపి తిరిగి సోమవారం ముంబై చేరుకున్నారు ఈ పటౌడి ఫ్యామిలీ. సోమవారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా కెమెరాలకు చిక్కిన ఈ నవాబ్‌ కుటుంబం రిచ్‌ స్టైలిష్‌ లుక్‌లో కళ్లు చెదిరేలా దర్శనమించారు. లైట్‌ పింక్‌ షర్టుపై కోటు ధరించిన సైఫ్‌ హుందాగా కనిపించగా.. బ్లూ టి-షర్టు, ప్యాంట్‌పై స్నీకర్స్‌ షూతో ఉన్న చోటా నవాబ్‌ ముద్దుగా ఉన్నాడు.

ఇక ఆలివ్‌ గ్రీన్‌ షూ.. బ్లాక్‌ పైజామాపై కో-ఆర్డర్‌ కోటు ధరించి దానికి మ్యాచ్‌ అయ్యే హర్మిస్‌ బిర్కిన్‌ బ్యాగ్‌తో సింపుల్‌గా కరీనా అదరగొట్టారు. అయితే కరీనా బ్యాగ్‌ విలువ తెలిస్తే ప్రతి ఒక్కరు కంగుతినాల్సిందే. ప్రఖ్యాత బ్రాండ్‌కు చెందిన ఆ హ్యాండ్‌ బ్యాగ్‌ ధర 18,237 డాలర్లు(సుమారు రూ. 13 లక్షలు). ఇక కరీనా దగ్గర ఇంకా ఇలాంటివి 5 బ్యాగులు ఉన్నాయట. ఒక్కొక్క బ్యాగు ధర కనీసం పది లక్షలకు తక్కువ ఉండదు. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండటంతో... ‘అమ్మో! అంతా ఖరీదైన బ్యాగు వాడుతున్నారా.. కరీనా నిజంగా బిలియనీరే. అయినా పటౌడి ఫ్యామిలి అంటే ఆ మాత్రం ఉండాలి’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

(చదవండి: అవునా.. కేర్‌టేకర్‌కు అంత జీతమా?!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు