క్రిస్మస్‌ పార్టీలో ‘లవ్‌బర్డ్స్‌’ సందడి

25 Dec, 2019 14:15 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ బడా ఫ్యామిలీ  ఇళ్లల్లో ఏ వేడుక జరిగినా  సినీ తారలంతా అక్కడా ప్రత్యక్షమవుతారు.  అందరితో ఆడి పాడి సరాదాగా గడుపుతారు. గత వారం కరీనా కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ల ముద్దుల తనయుడు తైమూర్‌ అలీఖాన్‌ పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం క్రిస్మస్‌ సందర్భంగా మంగళవారం రాత్రి కరీనా-సైఫ్‌ అలీఖాన్‌ ఇంట్లో గ్రాండ్‌ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి కపూర్‌ ఫ్యామిలీతోపాటు బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌​-అలియా భట్‌.. మలైకా అరోరా- అర్జున్‌ కపూర్‌ హాజరయ్యారు. 

ఎంతో వైభవంగా ఏర్పాటు చేసిన ఈ పార్టీకి వచ్చిన అతిథిలందరూ పార్టీలో ఎంజాయ్‌ చేయగా పార్టీకి సంబంధించిన ఫోటోలను సారా అలీఖాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ పార్టీలో ప్రేమ జంటలతోపాటు కరీనా, సైఫ్‌ అలీఖాన్‌, సారా అలీఖాన్‌, నటాషా, సంజయ్‌ కపూర్‌- మహీప్‌ కపూర్‌ ఉన్నారు. మరోవైపు దీనికంటే ముందే సల్మాన్‌ఖాన్‌ సోదరి అర్పితా ఖాన్‌, భర్త ఆయుష్‌ శర్మతో కలిసి మంగళవారం తమ ఇంట్లో క్రిస్మస్‌ సెలబ్రేషన్స్ నిర్వహించారు.. ఈ పార్టీకి  నిర్మాత కరణ్‌ జోహర్‌,  కరీనా- సైఫ్‌, సల్మాన్‌ ఖాన్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌-జెనీలియా, నీతూ కపూర్‌, ఏక్తా కపూర్‌ తదితరులు విచ్చేశారు. 

Red nose reindeer 🦌 White snowflake ❄️ Virgin eggnog 🥚 Christmas cake 🎂 Get the party started 🎈 It’s Christmas Eve for heavens sake 🎄

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Merry Christmas ❤️😍 #AliaBhatt #KareenaKapoor #MalaikaArora #AmritaArora #party #lastnight

A post shared by Manav Manglani (@manav.manglani) on

❤️❤️❤️❤️❤️ @therealkarismakapoor @malaikaaroraofficial @amuaroraofficial @natasha.poonawalla

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు