‘ఆమె నా మరదలైతే.. చాలా సంతోషిస్తాను’

14 Oct, 2019 08:56 IST|Sakshi

రణబీర్ కపూర్, అలియా భట్‌ల ప్రేమ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఘాడమైన ప్రేమలో మునిగితేలుతున్నారని బీటౌన్‌లో పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే వీరిద్దరూ పబ్లిక్‌గానే తిరగేస్తుంటారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో వీరి పెళ్లి గురించే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో రణ్‌బీర్‌ సోదరి, స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ వీరిద్దరి బంధంపై స్పందించారు. తాజాగా కరీనా, అలియాభట్‌లు కరణ్‌జోహార్‌ వ్యాఖ్యతగా వ్యవహరించే షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరణ్‌, అలియాను ఉద్దేశిస్తూ.. ‘నీ జీవితంలో ఎప్పుడైనా కరీనా కపూర్‌ నీకు వదిన అవుతుందని అనుకున్నావా’ అని ప్రశ్నించారు.

అయితే ఈ ప్రశ్నకు అలియా కంటే ముందే కరీనా స్పందించారు. ‘అలియా నాకు మరదలైతే.. నాకంటే ఎక్కువు సంతోషించే వారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు’ అన్నారు. దానికి అలియా సిగ్గుపడుతూ సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. అంతేకాక ‘ఇంతవరకు నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేద’ని తెలిపారు. కరణ్‌ ఈ టాపిక్‌ను ఇంతటితో వదిలేయకుండా.. ‘ఒక వేళ నీకు, రణ్‌బీర్‌కు వివాహం అయితే నేను, కరీనా చాలా సంతోషిస్తాం.. థాలీతో ఎదురుచూస్తూంటాం. అంతేకాక ఒక వేళ నువ్వు, రణ్‌బీర్‌ వివాహం చేసుకున్నప్పటికి కరీనా లానే మీ కెరియర్‌ను కొనసాగించాలి’ అన్నారు.

అలియా ఈ వ్యాఖ్యలకు మద్దతిస్తూ.. ‘అవును గతంలో ఓ హీరోయిన్‌కు వివాహం అయ్యిందంటే ఇక ఆమె కెరియర్‌ ముగిసిపోయినట్లే అని భావించేవారు. కానీ కరీనా వీటన్నింటిని బద్దలు చేశారు. వ్యక్తిగత జీవితం, కెరియర్‌ రెండింటిని ఆమె చాలా బాగా బ్యాలెన్స్‌ చేసుకుంటున్నారు. ఆమె దగ్గర పని చేసే వారంతా కరీనా గురించి ఎంతో గొప్పగా చెప్తారు’ అన్నారు అలియా.
(చదవండి: ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా