ఈసారి ముంబైలోనే తైమూర్‌ బర్త్‌డే: కరీనా

14 Dec, 2019 18:15 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌లో అందరికంటే పాపులర్‌, బాల్యం నుంచే సినీ నటులను మించి క్రేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించిన తైమూర్‌అలీఖాన్‌ త్వరలోనే డిసెంబరు 20న తన 3వ పుట్టినరోజును జరుపుకోనున్నాడు. తన పుట్టినరోజుకు రెండు కేకులు కావలని డిమాండ్‌ చేశాడని తల్లి, బాలీవుడ్‌ నటీ కరీనా కపూర్‌ ఖాన్ ఒక ఈవెంట్‌లో చెప్పుకొచ్చారు. అందులోను ఒకటి 'శాంతా' మరోకటి 'హల్క్‌' కావాలని ప్రత్యేకంగా కోరడంతో కేకును ఆర్డర్‌ ఇచ్చామన్నారు. ఎంతయినా 'కపూర్‌' కదా.. కాసింత ఎక్కువే కావాలని అడుగుతాడని హాస్యం జోడించారు. టిమ్‌.. బర్త్‌డేను ఈ సంవత్సరం ముంబైలోనే.. అత్యంత కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరుపుకుంటామని తెలిపారు. కాగా తైమూర్‌ తన రెండవ బర్త్‌డేను మీడియాకు దూరంగా.. తల్లిదండ్రుల సమక్షంలో సౌత్‌ ఆఫ్రికాలో ఘనంగా జరుపుకొన్నాడు. తైమూర్‌ కనిపిస్తే చాలు.. టిమ్‌..టిమ్‌ అని హడావిడి చేస్తూ.. కెమెరాలో బంధించే మీడియావారు ఈసారి ఏమి చేస్తారో చూడాల్సిందే. 

ఇక కరీనా కపూర్‌ తాను నటించిన 'గుడ్‌న్యూస్‌' చిత్రం డిసెంబరు 27న విడుదల కానుండడంతో.. సినిమా ప్రమోషన్‌లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో కరీనాతో పాటు నటులు కియారా అద్వానీ, అక్షయ్‌ కుమార్‌, దిల్జీత్‌ ప్రధాన పాత్ర పోషించనున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా విరాళం

వాయిస్‌ ఓవర్‌

ఐటీ మోసగాళ్ళు

కరోనా పాట

ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి

సినిమా

కరోనా విరాళం

వాయిస్‌ ఓవర్‌

ఐటీ మోసగాళ్ళు

కరోనా పాట

ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి

చరణ్‌ బర్త్‌డే: ఉపాసననే స్వయంగా..