ఓటీటీకి కార్గిల్‌గాళ్‌

10 Jun, 2020 01:37 IST|Sakshi

అమితాబ్‌బచ్చన్‌ – ఆయుష్మాన్‌ ఖురానా కలిసి నటించిన ‘గులాబో సితాబో’, విద్యాబాలన్‌ టైటిల్‌ రోల్‌ చేసిన ‘శకుంతలాదేవి’ (హ్యూమన్‌ కంప్యూటర్‌గా చెప్పుకునే శకుంతలాదేవి బయోపిక్‌) చిత్రాలు థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానున్న విషయం తెలిసిందే. మరో హిందీ చిత్రం ‘గుంజన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గాళ్‌’ కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ ఈ చిత్రంలో కథనాయికగా నటించారు. చిత్రనిర్మాతల్లో ఒకరైన కరణ్‌ జోహార్‌ ఈ సినిమా డిజిటల్‌ రిలీజ్‌ గురించి మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్‌ ఇండియన్‌ ఫీమేల్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది.  శరణ్‌ శర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 13న విడుదల చేయాలనుకున్నాAmitabh Bachchanరు. ఆ తర్వాత ఏప్రిల్‌ 24కు వాయిదా వేశారు. కరోనాతో థియేటర్లు మూతపడటంతో విడుదల సాధ్యపడలేదు. అందుకని ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. అయితే విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. 

మరిన్ని వార్తలు