బెని‘గిఫ్ట్’!

30 Jan, 2015 00:28 IST|Sakshi
బెని‘గిఫ్ట్’!

 పెళ్లొకరిది... గిఫ్ట్ ఇంకొకరిదంటే ఇదే మరి! ఆడపడచు సోహా అలీఖాన్ మెహందీ ఫంక్షన్‌లో బాలీవుడ్ కలల రాణి కరీనా కపూర్‌కు ఓ అపురూప బహుమతి దక్కింది. ఇచ్చింది కూడా తన అక్క కరిష్మానే! సోహా మెహందీ సందర్భంగా... వారసత్వంగా వస్తున్న అమ్మమ్మ కృష్ణారాజ్‌కపూర్ రింగ్‌ను చెల్లికి మురిపెంగా ప్రజెంట్ చేసింది కరిష్మా. ఈ ఉంగరాన్ని ఇరవై ఏళ్ల కిందట కృష్ణ... కరిష్మాకు ఇచ్చిందట. ప్రస్తుతం కరణ్‌జోహార్ చిత్రం షూటింగ్‌లో క్షణం తీరిక లేకుండా ఉన్న కరీనా... సోహా ఫంక్షన్‌కు వచ్చి వెళ్లిపోయిందట. ఈ కార్యక్రమంలో అక్కాచెల్లెళ్లు కరిష్మా, కరీనా ఎంతో ఆప్యాయంగా గడిపారనేది ఓ వెబ్‌సైట్ కథనం.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి