‘బిచ్చగాడు’లా హిట్‌ అవ్వాలి

5 Nov, 2018 01:44 IST|Sakshi
వసంత్‌ సమీర్, సెహర్‌

‘‘మా సంస్థ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన అన్ని సినిమాలకంటే వైవిధ్యంగా ‘కర్త కర్మ క్రియ’ ఉండబోతోంది. నాగు గవర కథ ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్‌కు గురి చేసేలా ఉంటుంది. ట్రైలర్‌ ఎంత గ్రిప్పింగ్‌గా ఉందో సినిమా అంతకుమించి ఉంటుంది’’ అని సమర్పకులు చదలవాడ  శ్రీనివాసరావు అన్నారు. వసంత్‌ సమీర్, సెహర్‌లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ‘వీకెండ్‌ లవ్‌’ ఫేం నాగు గవర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కర్త కర్మ క్రియ’. శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్‌ పతాకంపై చదలవాడ బ్రదర్స్‌ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఈనెల 8న విడుదలకానుంది.

ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసిన అనంతరం చదలవాడ  శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘నాగు గవర కథ చెప్పిన దాని కంటే ది బెస్ట్‌గా ఈ సినిమాను బాధ్యతగా తీశారు. మా బ్యానర్‌లో సూపర్‌ హిట్‌ అయిన ‘బిచ్చగాడు’ సినిమా తరహాలో ‘కర్త కర్మ క్రియ’ హిట్‌ కావాలి’’ అన్నారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న కల్పిత కథ ఇది. రియలిస్టిక్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా ఉంటుంది. పక్కా ప్లానింగ్‌తో అనుకున్న సమయానికి ఈ సినిమాను పూర్తి చేశాం. అన్ని  కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో తెర కెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నాగు గవర. ‘‘ఓ మంచి చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది’’ అని వసంత్‌ సమీర్, సెహర్‌ అన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇటలీలో మన గాయని

స్ఫూర్తి నింపేలా...

మిస్‌ యు

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ 

ఆ వార్తలు నిజం కాదు

సినిమా

ఇటలీలో మన గాయని

స్ఫూర్తి నింపేలా...

మిస్‌ యు

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ 

ఆ వార్తలు నిజం కాదు

ప్రజల కోసం చేసిన పాట ఇది