దొంగ వస్తున్నాడు

25 Nov, 2019 04:03 IST|Sakshi
దొంగ’ పోస్టర్‌

హీరో సూర్య సతీమణి, నటి జ్యోతిక, హీరో కార్తీ, సత్యరాజ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దొంగ’. జీతు జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. వయాకామ్‌ 18 స్టూడియోస్, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై సూరజ్‌ సదానా నిర్మించిన ఈ సినిమా డిసెంబరులో విడుదలకానుంది. కార్తీ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌లో మరో విభిన్న చిత్రం ‘దొంగ’. వైవిధ్యమైన చిత్రాలను ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమాని కూడా బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నా.

యాక్షన్‌తో పాటు ఎమోషన్‌కి అందరూ కనెక్ట్‌ అవుతారు. మా అన్న సూర్యగారు విడుదల చేసిన ‘దొంగ’ ఫస్ట్‌ లుక్‌కి, హీరో నాగార్జునగారు రిలీజ్‌ చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఆదివారం సెకండ్‌ లుక్‌ని రిలీజ్‌ చేశాం. నా కెరీర్‌లో మరచిపోలేని మరో చిత్రమిది’’ అన్నారు. ‘‘దొంగ’ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.డి.రాజశేఖర్, సంగీతం: గోవింద్‌ వసంత.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

సినిమా

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు