అన్న సినిమాలో తమ్ముడు

18 May, 2016 14:07 IST|Sakshi
అన్న సినిమాలో తమ్ముడు

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ మల్టీ స్టారర్ల సీజన్ నడుస్తోంది. ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు తెరను పంచుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటే, అభిమానులు కూడా ఈ తరహా సినిమాలకు భారీ కలెక్షన్లను సాధించిపెడుతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా టాలీవుడ్లోనే కనిపించిన ఈ ఫార్ములా ఇప్పుడు కోలీవుడ్ స్క్రీన్ మీద కూడా సందడి చేయనుంది. ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇద్దరు స్టార్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు హీరోలకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.

తమిళ్తో పాటు తెలుగులో కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు సూర్య, కార్తీ. ఈ ఇద్దరు హీరోలకు సౌత్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉంది. అందుకే వీళ్లు హీరోలుగా నటించిన సినిమాలు టాలీవుడ్లో తెలుగు సినిమా స్థాయిలో భారీగా రిలీజ్ అవుతాయి. ఇటీవల 24 సినిమాతో టాలీవుడ్ మార్కెట్లో సంచలనాలు నమోదు చేసిన సూర్య త్వరలో సింగం 3తో మరోసారి మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాతో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

సింగం సీరీస్లో తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన హరి, ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. సూర్య సరసన అనుష్క, శృతిహాసన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సూర్య తమ్ముడు కార్తీ కీలక పాత్రలో కనిపించనున్నాడట. రెండు కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటలోనూ సూర్య, కార్తీలు కలిసి నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు చిత్రయూనిట్ అఫీషియల్గా ఎనౌన్స్ చేయకపోయినా, అభిమానులు మాత్రం ఈ వార్తతో పండగ చేసుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా