ఆన్‌ ద వే!

25 Feb, 2019 00:26 IST|Sakshi

అంతా సవ్యంగా సాగి ఉంటే ధనుష్‌ హీరోగా ‘పేట’ ఫేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం ఈ పాటికే వెండితెరపైకి వచ్చి ఉండేది. కానీ, కొన్ని కారణాలవల్ల ఈ చిత్రం బాగా ఆలస్యం అయ్యింది. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ చిత్రం ఆగలేదు. ఆన్‌ ద వేలో ఉందని తాజా కోలీవుడ్‌ ఖబర్‌. కార్తీక్‌ సుబ్బరాజ్‌ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌పైనే వర్క్‌ చేస్తున్నారని సమాచారం. ధనుష్‌ ప్రస్తుతం వెట్రీ మారన్‌ దర్శకత్వంలో ‘అసురన్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఇంకా సత్యజ్యోతి ఫిల్మ్స్‌ నిర్మాణసంస్థలో రెండు సినిమాలకు కమిట్‌ అయ్యారు. 

దర్శకునిగా  ఓ సినిమా ఉంది. ఇలా వరుస కమిట్‌మెంట్స్‌తో ధనుష్‌ బిజీగా ఉన్నారు. మరి.. ఈ కమిట్‌మెంట్స్‌ అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత కార్తీక్‌ సుబ్బరాజ్‌ చిత్రం స్టార్ట్‌ అవుతుందా? లేక ఈ ఏడాదే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందా? వెయిట్‌ అండ్‌ సీ. 

 

మరిన్ని వార్తలు