'చావుకబురు చల్లగా’ చెప్పిన కార్తికేయ

13 Feb, 2020 11:31 IST|Sakshi

‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన యువకెరటం కార్తికేయ. తొలి నుంచి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే ఈ యంగ్‌ హీరో ఇటీవలే చేసే​ ప్రయోగాలు ప్రేక్షకులను మెపించలేకపోతున్నాయి. ఆర్‌ ఎక్స్‌ 100 తర్వాత చేసిన హిప్పీ, గుణ 369, 90 ఎంఎల్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో  వెరైటీ టైటిల్‌, కొత్త గెటప్‌లో తెరముందుకు రాబోతున్నాడు కార్తికేయ. ఆ వెరైటీ టైటిలే 'చావుకబురు చల్లగా'. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ గురువారం మొదలైంది.

కౌశిక్‌ అనే యువదర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో 'బస్తీ బాలరాజు' పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ ను కూడా గురువారం విడుదల చేశారు. శవాలను స్మశానానికి తీసుకెళ్లే వాహనంపై నుంచుని దమ్ముకొడుతూ ఆయన కనిపిస్తున్నాడు. గళ్ల షర్టు పైకి మడిచి .. లుంగీ పైకి కట్టి పూర్తి మాస్ లుక్ తో ఆయన వున్నాడు. ఈ సినిమాకి జాక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు