పుట్టిన రోజున ఫ్యాన్స్కు కార్తీ గిఫ్ట్

26 May, 2016 08:17 IST|Sakshi
పుట్టిన రోజున ఫ్యాన్స్కు కార్తీ గిఫ్ట్

తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న కోలీవుడ్ స్టార్ కార్తీ. ప్రయోగాత్మక చిత్రాల హీరో సూర్య వారసుడిగా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కార్తీ, వరుస సక్సెస్లతో స్టార్ హీరోగా ఎదిగాడు. తనకంటూ సొంతం మార్కెట్ క్రియేట్ చేసుకొని స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం కాష్మోరా సినిమాలో విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ యువ హీరో బుధవారం తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు.

ఇన్నాళ్లు సోషల్ మీడియాలో అడుగుపెట్టని కార్తీ. ఇక మీదట తన సినిమా విశేషాలు తెలియజేయటంతో పాటు అభిమానులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ట్విట్టర్లోకి అడుగుపెట్టాడు. @karthi_offl హ్యాండిల్తో ఎకౌంట్ క్రియేట్ చేసిన కార్తీ అభిమానుల కోసం తొలి ట్వీట్ చేశాడు. కార్తీ సోషల్ మీడియా ఎంట్రీ పై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.