కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టా: బాలీవుడ్‌ నటుడు

6 Apr, 2020 13:39 IST|Sakshi

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ముందుకు వచ్చి ఆపద కాలంలో ప్రజలను ఆదుకుంటూ రియల్‌ హీరోలు అనిపించుకుంటున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేస్తున్నారు. కరోనా మహమ్మారితో పోరాడేందుకు ప్రధాని పిలుపు మేరకు బాలీవుడ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ విరాళాలు అందించి తన ఔధార్యాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ యువ నటుడు ఆదివారం ఓ హాస్యభరితమైన పోస్ట్‌ చేశాడు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాను అంతమొందించేందుకు వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు కల కన్నాడట. అభిమానులు చుట్టూ గుమిగూడి ఉండగా. మధ్యలో కారుపై కార్తిక్‌ నిల్చొని అభిమానులకు చేయి ఊపుతున్నట్లు ఉండే ఓ వీడియోను కార్తిక్‌ ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. (దియా జలావొ: ‘దీపావళి అనుకున్నారేంటి?’)

‘కరోనా వైరస్‌ కోసం నేను వ్యాక్సిన్‌ కనుగొన్నానని కల కన్నాను.’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఈ  పోస్టుపై అభిమానులు స్పందిస్తూ.. ‘భాయ్‌ బయోటెక్నాలజి చదివుంటాడు’ అని కామెంట్‌ చేస్తున్నారు.  దీనిపై కార్తీక్ ప్రతిస్పందిస్తూ ‘మీరు బయోటెక్నాలజీ నుంచి ఒక భాయ్‌ను తొలగించవచ్చు, కాని మీరు భాయ్ నుంచి బయోటెక్నాలజీని తొలగించలేరు’. అంటూ బదులిచ్చారు. ఇక కార్తిక్‌ ముంబైలోని డీవై పాటిల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్‌ పట్టా పొందిన విషయం తెలిసిందే. ఇక కార్తిక్‌ ఇలా చిలిపి పనులు చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకముందు కూడా కార్తిక్‌ తన చమత్కారాన్ని ప్రదర్శించాడు. తనను వృద్ధుడిగా చూపించే ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘లాక్‌డౌన్‌లో వృద్ధాప్యం. బాగ్భాన్‌ రీమేక్‌ చేయాలనుకుంటున్నాం. హీరోయిన్‌ పాత్ర కోసం మీ ఎంట్రీలను పంపడి’ అంటూ చమత్కరించారు. కాగా  ప్రస్తుతం కార్తీక్.. ‘దోస్తానా 2’ ‘భూల్ భూలైయా 2’లలో నటిస్తున్నారు. (‘వదినా.. అతనే కదా అలా పిలవమని చెప్పింది’)

నా తండ్రిని చూసి 3 వారాలయ్యింది: సల్మాన్‌

Aaj Sapna Aaya ki Mujhe Vaccine Mil Gayi👨🏻‍🔬

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

మరిన్ని వార్తలు