అది నా ఇమేజ్‌ కాదు.. సినిమాది!

1 Aug, 2019 01:11 IST|Sakshi
కార్తికేయ

‘‘హిట్‌ సాధించిన సినిమాలో నటించిన హీరో చాలా లక్కీ. ఒక యాక్టర్‌గా సినిమాలో నా కృషి పది శాతమే. దర్శకులు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఒక సినిమా సక్సెస్‌లో చాలామంది భాగస్వామ్యం ఉంటుంది. కానీ ఒక హిట్‌ మూవీ సక్సెస్‌ను ఎక్కువగా ఎంజాయ్‌ చేసేది మాత్రం హీరోలే’’ అన్నారు కార్తికేయ. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటించిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు..

► ఇందులో ఒంగోలులోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన గుణ అనే యువకుడి పాత్రలో నటించాను. చీమకుర్తి క్వారీ ఫ్యాక్టరీలో గుణ వర్క్‌ చేస్తుంటాడు. అతని వీధి చివర ఉండే సెల్‌ఫోన్‌ షాప్‌లోని అమ్మాయితో ప్రేమలో పడతాడు. హఠాత్తుగా అతను ఖైదీగా మారాల్సి వస్తుంది. ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? వాటినుంచి గుణ ఎలా బయటప డ్డాడు? అన్నదే కథాంశం. దర్శకుడు అర్జున్, నా అభిరుచులు, అభిప్రాయాలు చాలా దగ్గరగా ఉంటాయి.

► ‘ఆర్‌ఎక్స్‌ 100’లో నేను చేసిన పాత్రకు మంచి మాస్‌ ఫాలోయింగ్‌ వచ్చింది. ‘హిప్పీ’ నాలోని మరో యాక్టింగ్‌ యాంగిల్‌ని బయటపెట్టింది. ‘గుణ 369’ కూడా నా నటనలోని మరో కోణాన్ని ఆడియన్స్‌కు తెలిసేలా చేస్తుందనుకుంటున్నాను. నేనేం స్టార్‌ హీరో అయిపోవాలనుకోవడం లేదు. సినిమా హిట్‌ సాధించినా, ఫెయిల్‌ అయినా క్యారెక్టర్‌ కోసం కార్తికేయ వందశాతం కష్టపడ్డాడు అని ఆడియన్స్‌ గుర్తిస్తే చాలు. మాలాంటి కొత్తవారికి చిరంజీవిగారే స్ఫూర్తి. మాస్‌ హీరో కావాలని ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా చేయలేదు. సినిమా విడుదలైన తర్వాత మాస్‌ హీరో అన్నారు. అయినా అది నా ఇమేజ్‌ కాదు. మూవీ ఇమేజ్‌ అనుకుంటున్నాను. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఇతర భాషల్లో రీమేక్‌ అవుతుందంటే గర్వంగా ఉంది. కానీ నాకు రీమేక్‌ సినిమాలు చేయడం ఆసక్తిగా లేదు.

► నాని ‘గ్యాంగ్‌లీడర్‌’లో విలన్‌గా చేస్తున్నాను అంటే అది స్పెషల్‌ క్యారెక్టర్‌ కాబట్టే. ఆ పాత్ర స్పెషల్‌ కాకపోయి ఉంటే విక్రమ్‌గారు నన్ను అప్రోచ్‌ అయ్యేవారు కాదేమో. ప్రస్తుతం శేఖర్‌ అనే కొత్త దర్శకుడు తీస్తున్న సినిమాలో హీరోగా చేస్తున్నాను. శ్రీ అనే మరో కొత్త దర్శకుడితో సినిమా కమిట్‌ అయ్యాను.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మగధీర’కు పదేళ్లు..రామ్‌చరణ్‌ కామెంట్‌..!

బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం

కంగనాకు ఖరీదైన కారు గిఫ్ట్‌..!

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

అవ్వలా కనిపిస్తోంది‌.. ఆ నటికి ఏమైంది?

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

‘సాహో’ సంగీత దర్శకుడిపై దాడి

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!

సంజయ్‌ దత్‌కు లీగల్‌ నోటీసులు!

సైమాకు అతిథులుగా..!

ఆమె డ్యాన్స్‌ చూస్తే.. నిజంగానే పిచ్చెక్కుతుంది!!

ఫ్యాన్స్‌ వార్‌.. కత్తితో దాడి

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

స్టార్‌ హీరోల సినిమాలకు షాక్‌!

బోనీతో మరో సినిమా!

‘సైరా’ సందడే లేదు?

క్రేజీ స్టార్‌తో పూరి నెక్ట్స్‌!

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి

నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే...

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’

బిగ్‌బాస్‌.. భార్యాభర్తల మధ్య గొడవలు

బిగ్‌బాస్‌లో రేలంగి మామయ్య

హౌస్‌మేట్స్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు

అజిత్‌ షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడా.. !

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జనగణమన ఎవరు పాడతారు?

అది నా ఇమేజ్‌ కాదు.. సినిమాది!

రవి అవుట్‌ రత్న ఇన్‌!

‘మగధీర’కు పదేళ్లు..రామ్‌చరణ్‌ కామెంట్‌..!

బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం

కంగనాకు ఖరీదైన కారు గిఫ్ట్‌..!