సేఫ్‌ జానర్‌లో వెళ్లాలనుకోను

8 Dec, 2019 00:19 IST|Sakshi
కార్తికేయ

‘‘విభిన్న జానర్స్‌లో సినిమాలు చేయడానికి ఇష్టపడతా. సేఫ్‌ జానర్‌ అంటూ ఒకే రకమైన పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఎలాంటి పాత్రౖకైనా కార్తికేయ నటుడిగా న్యాయం చేయగలడు అని రచయితలు నమ్మాలన్నదే నా లక్ష్యం ’’ అన్నారు కార్తికేయ. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వంలో కార్తికేయ హీరోగా రూపొందిన చిత్రం ‘90ఎమ్‌ఎల్‌’. అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజైంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు.

► ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతి రివ్యూలోనూ కార్తికేయ పెర్ఫార్మెన్స్‌ బాగుందంటున్నారు. సోషల్‌ మీడియాలోనూ సినిమా గురించి పాజిటివ్‌ కామెంట్సే కనిపిస్తున్నాయి. విడుదల రోజు రెండు థియేటర్స్‌కు వెళ్లాను. అక్కడ ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడుతూ, విజిల్స్‌ వేస్తూ ఎంజాయ్‌ చేయడం చూశాక చాలా హ్యాపీ ఫీలయ్యాను. థియేటర్‌లో సినిమా చూడటానికి వచ్చిన ఆడియన్స్‌ లాజిక్‌లు గురించి ఆలోచించకుండా నవ్వుకోవాలనుకుని ఈ సినిమా తీశాం. అందులో సక్సెస్‌ అయ్యామనే అనుకుంటున్నాం.

► ‘90 ఎమ్‌ఎల్‌’ అని టైటిల్‌ పెట్టడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌ దూరం అవుతారనుకోవడం లేదు. టైటిల్‌ ఆసక్తిగా ఉంటుందని సినిమా చూస్తారనుకున్నాం. అలాగే చూస్తున్నారు. ఆర్‌ఎక్స్‌ 100, హిప్పి, గుణ 369 చితాల్లో నాకు పెద్దగా డ్యాన్స్‌ చేసే అవకాశం రాలేదు. అది ఈ చిత్రంతో కుదిరింది. చిన్న సెన్సార్‌ సమస్య వల్ల సినిమా ఒక రోజు ఆలస్యంగా విడుదలైంది. సినిమాలో ఆల్కహాల్‌ బ్రాండ్‌ పేర్లు చెప్పాల్సిన సన్నివేశాల్లోని పదాలను బీప్‌ చేశాం. ఎటువంటి అసభ్యకరమైన పదజాలం సినిమాలో లేదు.

► నాకు కథ నచ్చే సినిమాను స్టార్ట్‌ చేస్తా. నా జడ్జ్‌మెంట్‌ అన్నిసార్లూ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేíషించుకుంటాను. నేను ఎంపిక చేసుకున్న కథలతో తెరకెక్కిన సినిమాలు విజయం సాధించినా, సాధించకపోయినా నా ఎంపికల్లో ఒక సర్‌ప్రైజ్‌ మాత్రం ఉంటుంది.

► ‘నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌’లో నేను చేసిన విలన్‌ పాత్రకు మంచి స్పందన  వచ్చింది. మరిన్ని విలన్‌ పాత్రలు చేయాలని ఉంది. కానీ అవి నన్ను ఎగ్జైట్‌ చేసేలా ఉండాలి. ప్రస్తుతం 2 సినిమాల్లో హీరోగా నటిస్తున్నా.

మరిన్ని వార్తలు