డూప్‌ హీరోల సందడి

30 Oct, 2018 03:11 IST|Sakshi
శివ, శ్రుతి

బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ డూప్‌లు భాస్కర్, శివ, చందు హీరోలుగా హాబీబ్‌ తెరకెక్కించిన చిత్రం ‘కథానాయకులు’. సి.రామాంజనేయులు నిర్మించారు. ఈ చిత్రం నవంబర్‌ 2న విడుదల కానుంది. హబీబ్‌ మాట్లాడుతూ – ‘‘ఒక మల్టీస్టారర్‌ మూవీ చూస్తున్న ఫీలింగ్‌ ప్రేక్షకులకు కలుగుతుంది. ఫస్ట్‌ హాఫ్‌ వినోదంగా సెకండాఫ్‌ థ్రిల్‌కు గురి చేసే విధంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఓ మంచి సినిమా నిర్మించినందుకు సంతోషంగా ఉంది. పెద్ద హీరోల ఫ్యాన్స్‌ ఎక్కడా నొచ్చుకోకుండా చేశాం’’ అన్నారు నిర్మాత రామాంజనేయులు. ఈ చిత్రానికి కెమెరా: జో అండ్‌ శివ.

మరిన్ని వార్తలు