‘మాది 100% లవ్‌.. విడిపోం’

12 Dec, 2016 13:51 IST|Sakshi
‘మాది 100% లవ్‌.. విడిపోం’

లండన్‌: తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని హాలీవుడ్‌ ప్రముఖ నటి, టీవీ స్టార్‌ కాతీ ప్రైస్‌ చెప్పింది. తాను తన భర్త కైరన్‌ హేలర్‌ గాఢమైన ప్రేమలో ఉన్నామని తెలిపింది. తమ వివాహానికి సంబంధించి ఎలాంటి సమస్యలు రాలేదని స్పష్టం చేసింది. ’మేం 100శాతం ఒకరికొకరం. మాది గాఢమైన ప్రేమ. మేం విడిపోతున్నామంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే’ అని స్పష్టం చేసింది.

కాతీకి తెలియకుండా ఆమె స్నేహితురాళ్లతో కైరన్‌ సంబంధం నెరిపాడని ఈ విషయం తెలిసిన ఆమె విడిపోవాలనుకుంటుందని వార్తలు హల్‌ చల్‌ చేశాయి. అయితే, తాను ఒక టీవీ కార్యక్రమం ఉండటం వల్లే ఈ మధ్య కైరన్‌ కు కాస్త దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది తప్ప తాము విడిపోయినట్లు కాదని చెప్పింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కైరన్‌ ఆమెకు మూడో భర్త. 2013 జనవరిలో వివాహం చేసుకున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి