మరోసారి కెమెరాకు చిక్కిన కత్రినా, కౌశల్‌

24 Jan, 2020 09:50 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినాకైఫ్‌, నలుడు విక్కీ కౌశల్‌ మధ్య ప్రేమాయణం నడుస్తోందని బీటౌన్‌ కోడై కూస్తోంది. ఈ రహస్య జంట దీపావళీ సందర్భంగా ఓ స్నేహితుడు ఇచ్చిన దీపావళి పార్టీకి కలిసి రావడంతో.. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే పుకార్లు షికార్లు చేశాయి. ఆ ఫోటోలు అప్పట్లో నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా వీరిద్దరూ మరోసారి కెమెరా చేతికి చిక్కారు. విక్కీ సోదరుడు సన్నీ కౌశల్‌ స్వతహాగా సినిమాలపై ఆసక్తి ఉన్నావాడు.దీంతో ఆయన సొంతగా ఇటీవల ఓ ఫిల్మి డాక్యూమెంటరీని రూపొందించాడు. దీని విడుదలకు కత్రినా కైఫ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు విక్కీ కౌశల్‌. ఇక ఏమాత్రం ఆలస్యం చేయని అమ్మడు.. వెంటనే సరే అని డాక్యూమెంటరీ మూవీని ఆవిష్కరించింది. అనంతరం విక్కీ కుటుంబంతో కలిసి డిన్నర్‌ పార్టీలో ఎంజాయ్‌ చేసింది.

అయితే దీనిపై బాలీవుడ్‌ అభిమానులు రకరకలుగా గుసగుసలాడుతున్నారు. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు సృష్టిస్తున్నారు. కాగా కత్రినా, విక్కీ జంటగా కలిసి ఒక చిత్రంలో నటించనున్నారనే వార్తలు వస్తున్నా.. ఇప్పటివరకు ఏలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనే పుకార్లు వస్తున్నప్పటికిని కత్రినా, విక్కీ మాత్రం నోరు మెదపలేదు. ప్రస్తుతానికి వీరు సింగిల్‌ అని, డేటింగ్ చేయడం లేదని వీరి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు