అర్జున్‌ ఫొటోకు కత్రినా కామెంట్‌!

28 Feb, 2020 10:30 IST|Sakshi

సోషల్‌ మీడియాలో సెలబ్రెటీలు షేర్‌ చేసే  ఫొటోలకు వారి సహా నటులు సరదగా కామెంట్స్‌ చేసి ఆటపట్టిస్తుంటారు. ఇందులో బాలీవుడ్‌ సెలబ్రిటీలు ముందుంటారు. ముఖ్యంగా హీరో అర్జున్‌ కపూర్‌ బాలీవుడ్‌ నటి, నటులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వారి ఫొటోలకు కామెంట్లు పెట్టి ఏడిపంచడంలో ముందుంటాడన్న సంగతి తెలిసిందే. అయితే ఏప్పుడూ అందరిని ఏడిపించే అర్జున్‌ను తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ ఏడిపించారు.  అర్జున్‌ తాజా ఫొటో షూట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను అభిమానుల కోసం  సోషల్‌ మీడియా షేర్‌ చేశాడు. ఇక అవి చూసి కత్రినా ‘ఏమైంది.. నువ్వు ఏమైనా పోగొట్టుకున్నావా’ అని ఫన్నీగా కామెంట్‌ చేశారు. దీనికి అర్జున్‌ ‘అవును.. నీ నెంబర్‌ పోయింది. ఇక్కడ పంపించవా ప్లీజ్‌’ అంటూ సమాధానం ఇచ్చి కత్రినా షాకిచ్చాడు.

(140 కిలోల బరువు పెరిగాడు.. ఆ తర్వాత..)

వేడుకలో తళుక్కుమన్న మలైకా, అర్జున్‌

⏮️

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

అనుష్కను ఆటపట్టించిన హీరో!

కాగా కత్రినా షేర్‌ చేసినా ఫొటోలకు కూడా అర్జున్‌ కామెంట్స్‌తో ఏడిపించాడు. ఇటీవల బీజ్‌ తీరంలో కత్రినా తీసుకున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇక వెంటనే అర్జున్‌ ‘ఫొటోకి ఫోజ్‌ ఇస్తూ.. స్తంభాన్ని గుద్దేస్తావా ఏంటి’ అంటూ కత్రినాను ఆటిపట్టించాడు.  ఇలా వీరిద్దరూ సోషల్‌ మీడియాలో ఏడిపించుకోవడం  కొత్తేమి కాదు.. గతంలో కూడా కత్రినా షేర్‌ చేసినా ఫొటోలకు  అర్జున్‌ కామెంట్స్‌ చేసి  ఏడిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా కత్రినా ప్రస్తుతం బాలీవుడ్‌  ‘కిలాడి’ అక్షయ్‌ కుమార్‌ సరసన ‘సూర్యవంశీ’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అర్జున్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌తో కలిసి ఓ సినిమాలో నటించనున్నట్లు సమాచారం.

💙💚💛

A post shared by Katrina Kaif (@katrinakaif) on

మరిన్ని వార్తలు