ప్రియాంకకు బదులు కత్రినా?

14 Apr, 2018 11:11 IST|Sakshi

కృష్ణ జింకలను వేటాడిన కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన సల్మాన్‌ తన తదుపరి సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. చక చకా తన ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం రేస్‌ 3 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత సల్మాన్‌.. అలీ అబ్బాస్‌ జాఫర్‌ డైరెక్షన్‌లో ‘భరత్‌’ సినిమాను ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు గతంలో ఊహాగానాలు వినిపించాయి. ఈ సినిమా విషయం మాట్లాడేందుకే ప్రియాంక అమెరికా నుంచి ముంబైకి వచ్చిందని అందరూ అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా కత్రినా కైఫ్‌ను తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. టైగర్‌ జిందా హై సూపర్‌ హిట్‌ కావడంతో మళ్లీ అదే జోడిని తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు అలీ అబ్బాస్‌ ఉన్నాడని.. కత్రినాను దాదాపుగా ఓకే చేశారని తెలుస్తోంది. సల్మాన్, కత్రినాలది హిట్‌ పెయిర్‌ కూడా కావటంతో బిజినెస్‌ పరంగా కూడా ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారట చిత్రయూనిట్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు