మహేష్‌కు జోడిగా కత్రినా!

5 Jan, 2019 10:55 IST|Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తరువాతి చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ కత్రినా కైఫ్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. మహేష్‌ ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవలె హాలిడే ట్రిప్‌ను ముగించుకున్న మహేష్‌ త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్‌ కానున్నాడు.

మహర్షి తరువాత సుకుమార్‌ డైరెక్షన్‌లో మహేష్‌ ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్‌ నిర్మించనుంది. ఈ మూవీలో మహేష్‌ సరసన కత్రినాను నటింపజేయాలని మేకర్స్‌ ఆలోచించి.. కత్రినాను సంప్రాదించారట. కత్రినా కూడా దాదాపు ఓకే చెప్పేసినట్టు సమాచారం. ఇదే గనుక నిజమైతే.. ఈ చిత్రం బాలీవుడ్‌ దృష్టిని కూడా ఆకర్షించినట్టే. సినిమా బిజినెస్‌ పరంగా కూడా కలిసి వస్తుందని నిర్మాతలు కత్రినాకే ఓటేసినట్టు తెలుస్తోంది. అయితే మహేష్‌ ఇప్పటికే బిపాస బసు, అమృతరావు, ప్రీతిజింతా లాంటి బాలీవుడ్‌ భామలతో ఆడిపాడారు. సుకుమార్‌-మహేష్‌ కాంబోలో రాబోతోన్న ఈ మూవీలో కత్రినా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నా..వీటిపై చిత్రయూనిట్‌ మాత్రం స్పందించడం లేదు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హీరోయిన్‌ కోసం బాయ్‌ఫ్రెండ్స్‌ ఫైట్‌

అంతకు మించి...

మ్యాడసన్‌ @ సైలెన్స్‌

వేసవిలో క్రైమ్‌ కామెడీ

మా సినిమా యూత్‌కు మాత్రమే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరోయిన్‌ కోసం బాయ్‌ఫ్రెండ్స్‌ ఫైట్‌

అంతకు మించి...

మ్యాడసన్‌ @ సైలెన్స్‌

వేసవిలో క్రైమ్‌ కామెడీ

మా సినిమా యూత్‌కు మాత్రమే

ఎవరికీ చెప్పొద్దు!