వీరిద్దరి బ్రేకప్‌కు సల్మాన్ ఖాన్ కారణమ?

17 Jan, 2016 23:58 IST|Sakshi
వీరిద్దరి బ్రేకప్‌కు సల్మాన్ ఖాన్ కారణమ?

 ‘‘ఇంట్లో వాళ్లు కూడా ఒప్పేసుకు న్నారు... ఇక పెళ్లిపీటలు ఎక్కడమే ఆలస్యం. ఈ ఏడాది దంపతులైపోతారు’’... ఇవి బాలీవుడ్ ప్రేమజంట రణబీర్ కపూర్, కత్రినా కైఫ్‌ల గురించి ప్రతిరోజూ వస్తున్న అప్‌డేట్స్. రణబీర్-కత్రినా కైఫ్‌లు తమ బంధానికి గుడ్‌బై చెప్పుకున్నారన్నది తాజా ఖబర్. కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం  చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కత్రినా కైఫ్ వీరిద్దరూ ఉంటున్న  ఫ్లాట్ నుంచి తన లగేజ్ మొత్తం సర్దుకుని వెళ్లిపోయారట.
 
 ‘‘రణబీర్ ఎప్పుడూ తన నిర్ణయాల మీద నిలబడిన దాఖలాలు లేవు. ఓ రిలేషన్‌షిప్‌కు కమిట్ అయ్యే వ్యక్తి కాదు. ఎప్పుడూ తన నిర్ణయాలను మార్చుకుంటూనే ఉంటాడు’’ అని కత్రిన ఇటీవల ఓ సందర్భంలో అన్నారు.  గతంలో దీపికా పదుకొనే కూడా ఇలాంటి కారణం చెప్పే రణబీర్ నుంచి బ్రేకప్ అయ్యారు. ఇప్పుడు కత్రిన కూడా దూరమయ్యారనే వార్త బలంగా వినిపిస్తోంది. వీరిద్దరి బ్రేకప్‌కు సల్మాన్ ఖాన్ కారణమనే వార్త ప్రచారంలో ఉంది. నిజమేంటనేది నిలకడగా
 తెలుస్తుంది.