నేను ప్రభుదేవా అభిమానిని

26 Oct, 2018 11:31 IST|Sakshi

సినిమా: నేను ప్రభుదేవా అభిమానిని. ఆయన డాన్స్‌ అంటే ఎంత ఇష్టమో అని తెగ పొగిడేస్తోంది బాలీవుడ్‌ బ్యూటీ కత్రినాకైఫ్‌. ఇండియాలోనే మోస్ట్‌ గ్లామరస్‌ హీరోయిన్‌గా పేరుగాంచిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అమీర్‌ఖాన్‌తో థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ చిత్రంలో రీల్‌ ప్రేమాయణం సాగిస్తోంది. ఈ భారీ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌ కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అసలు విషయం ఏమిటంటే థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ చిత్రంలో నటి కత్రినాకైఫ్‌కు ఒక ఐటమ్‌ సాంగ్‌ తరహాలో ఒక దుమ్మురేపే పాట చోటుచేసుకుంటుందట. ఈ పాటకు డాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవా నృత్యరీతులను సమకూర్చారు. దీని గురించి కత్రినాకైఫ్‌ తెలుపుతూ ప్రభుదేవా తన ఫేవరేట్‌ నృత్యదర్శకుడు అని పేర్కొంది.

ఆయన డాన్స్‌ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పింది. ముఖ్యంగా ముక్కాబలా పాట తన ఫేవరేట్‌ సాంగ్‌ అని పేర్కొంది. తాను థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ చిత్రంలో ఈ పాటలో నటించడానికి కారణం ప్రభుదేవా కొరియోగ్రఫినేనని అంది. ఆయన నృత్యదర్శకత్వాన్ని చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది. ఇలాంటి వినూత్న కొరియోగ్రఫీని ప్రభుదేవా మాత్రమే చేయగలరని పేర్కొంది. తాను ప్రభుదేవా నృత్యదర్శకత్వంలో నటించడం ఇదే ప్రప్రథమం అని చెప్పింది. అదేవిధంగా అమితాబ్‌తో కలిసి ఈ పాటలో నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌లో ప్రభుదేవా నృత్యదర్శకత్వంలో తాను నటించిన సురైయ్యా అనే పాట హైలెట్‌గా ఉంటుందని చెప్పింది. యాష్‌ రాజ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. ఇందులోని సురైయ్యా అనే పాటలో అమితాబ్, కత్రినాకైఫ్‌ల మధ్య మంచి కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యిందని ఆయన తెలిపారు. ఈ చిత్రం నవంబర్‌ 8న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!

స్మగ్లింగ్‌ పార్ట్‌నర్స్‌?

మాస్‌ పవర్‌ ఏంటో తెలిసింది

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం