‘అందుకే ఆ సినిమా ఒప్పుకున్నా’

2 Aug, 2018 11:37 IST|Sakshi
కత్రినా కైఫ్‌ - సల్మాన్‌ ఖాన్‌(ఫైల్‌ ఫోటో)

‘నా ప్రియ స్నేహితుని కోసం ఈ సినిమా ఒప్పుకున్నాను’ అంటున్నారు అందాల ‘మల్లీశ్వరి’ కత్రినా కైఫ్‌. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో, సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ‘భారత్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తొలుత ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రియాంక చోప్రా ఈ చిత్రం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రియాంక స్థానంలోకి కత్రినా కైఫ్‌ వచ్చారు.

కత్రినా - సల్మాన్‌ జంటగా నటించిన చిత్రాల్లో ‘భారత్‌’ ఆరోది. ఇప్పటికే వీరిద్దరు జోడిగా ‘మైనే ప్యార్‌ క్యోం కియా’, ‘పార్టనర్‌’, ‘యువ్‌రాజ్’, ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ వంటి చిత్రాల్లో నటించారు. ‘భారత్‌’ చిత్రంలో నటించడం గురించి కత్రినాను అడగ్గా ‘డైరక్టర్‌ అలీ అబ్బాస్‌ జాఫర్‌ అంటే నాకు చాలా అభిమానం, గౌరవం. ఆయన నా ప్రియ స్నేహితుడు.

అలీ సినిమాల్లో నటించడం చాలా బాగుంటుంది. గతంలో నేను అలీ దర్శకత్వంలో  కొన్ని చిత్రాల్లో నటించాను. అవన్ని మంచి విజయం సాధించాయి. అన్నింటికి మించి అలీ దర్శకత్వంలో పని చేయడం అంటే చాలా కంఫర్ట్‌గా ఫీలవుతాను. అందుకే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాన’న్నారు.

అంతేకాక ‘అలీ నాతో మాట్లాడినప్పుడు నీకో స్క్రిప్ట్‌ పంపిస్తున్నాను. చదివి, దానిపై నీ అభిప్రాయం చెప్పమని అడిగాడు. అలీ పంపిన స్క్రిప్ట్‌ నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలో నా పాత్ర చాలా బాగుంటుంది. ఎప్పుడెప్పుడు నన్ను నేను తెర మీద చూసుకుంటానా అని ఆత్రంగా ఎదురు చూస్తోన్నాను. ఇంత మంచి చిత్రంలో నేను భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని’ తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా