సల్మాన్‌ నా అన్న కాదు : కత్రినా

27 May, 2019 14:01 IST|Sakshi

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌- కత్రినా కైఫ్‌ జంటగా తెరకెక్కిన తాజా మూవీ ‘భారత్‌’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్‌ 5 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘భారత్‌’కు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సల్మాన్‌- కత్రినాలు మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. చాలా కాలం తర్వాత సల్మాన్‌ భాయీజాన్‌తో నటించడం ఎలా ఉందంటూ ఓ విలేకరి కత్రినాను ప్రశ్నించారు. ఈ విషయంపై కత్రినా కంటే ముందే స్పందించిన సల్మాన్‌.. తాను కత్రినా భాయీజాన్‌ను కాదని, తననెప్పుడూ అలా పిలవనివ్వను అంటూ సరదాగా సమాధానమిచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి.

ఈ విషయంపై స్పందించిన కత్రినా మాట్లాడుతూ...‘అవును. నిజమే కదా. సల్మాన్‌ నా సోదరుడు కాదు. కేవలం స్నేహితుడు మాత్రమే. తనలో హాస్య చతురత గురించి మీకు తెలుసు కదా. ప్రతీ ఒక్కరితో సరదాగా ఉండటం తనకు అలవాటు. చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ ఉంటాడు. ఆ క్రమంలో పంచ్‌లు వేయాలని చూస్తుంటాడు. నేను కూడా తక్కువేం కాదు. అందుకే తనకి సరైన సమాధానం ఇస్తుంటా అంటూ చెప్పుకొచ్చింది.

కాగా మైనే ప్యార్‌ క్యోం కియాలో కత్రినా తొలిసారిగా సల్మాన్‌తో జోడీ కట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందాహై వంటి సినిమాల్లో వీరు కలిసి నటించారు. అయితే సల్మాన్‌తో కత్రినా డేటింగ్‌లో ఉందంటూ వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బాహాటంగా వారెప్పుడూ స్పందించలేదు. అయితే రణ్‌బీర్‌ కపూర్‌తో కత్రినా సన్నిహితంగా మెలగడంతోనే వీరి మధ్య బంధం తెగిపోయిందని బీ- టౌన్‌లో టాక్‌ విన్పించింది. కాగా రణ్‌బీర్‌ కపూర్‌ ప్రస్తుతం అలియా భట్‌తో డేటింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కత్రినా మళ్లీ సల్మాన్‌కు దగ్గరైందంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి నటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’