వైరల్‌ అవుతోన్న కత్రినా ఫస్ట్‌ లుక్‌

16 Jul, 2018 20:27 IST|Sakshi

సరైన హిట్‌కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌. బాలీవుడ్‌ ఖాన్‌ త్రయంలో షారుఖ్‌ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ఆమిర్‌, సల్మాన్‌ హిట్‌లమీద హిట్‌లు కొడుతున్నారు. అయితే ఈసారి ఎలాగైన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టాలని ‘జీరో’ సినిమాలో మరగుజ్జు పాత్రలో నటిస్తున్నాడు షారుఖ్‌. రంజాన్‌ స్పెషల్‌గా జీరో టీజర్‌ను విడుదల చేశారు. చాలా యేళ్ల క్రితం సల్మాన్‌, షారుఖ్‌లు కలిసి నటిస్తున్న సినిమా కావడం, టీజర్‌లో ఈ ఇద్దరు స్టార్‌లు కలిసి చేసిన సందడి చేయడంతో టీజర్‌ వైరల్‌గా మారింది.

కత్రినా కైఫ్‌ పుట్టిన రోజు (జూలై 16) సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌కు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాలో సెలబ్రెటీ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.  ముందు ఫోటోగ్రాఫర్స్‌ ఉండగా.. చుట్టూ భద్రత నడుమ నుడుస్తూ వస్తోన్న కత్రినా ఓ డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తోంది. మరో హీరోయిన్‌గా అనుష్క శర్మ నటిస్తోంది. రెడ్‌ చిల్లిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు