‘కౌసల్య కృష్ణమూర్తి’ రిలీజ్‌ ఎప్పుడంటే!

1 Aug, 2019 16:28 IST|Sakshi

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా కౌసల్య కృష్ణమూర్తి. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో  కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ‘ఒక ఆడపిల్లకి చక్కని సంబంధం చూసి పెళ్ళి చేయాలంటే మంచిచెడులు చాలా చూడాలి. అలాగే పెళ్లీడుకొచ్చిన మా ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాను కూడా మంచి డేట్‌ చూసి రిలీజ్‌ చెయ్యాలని అనుకున్నాం. అలా ఆగస్ట్‌ 23 చాలా మంచి డేట్‌ అని భావించి ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రెండు వందల శాతం ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఈనెల 23న విడుదల చేస్తున్నాం.

ఎటువంటి సినిమానైనా ఎదుర్కోగలుగుతుంది అనే నమ్మకం వచ్చిన తర్వాతే మా సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. భీమనేని శ్రీనివాసరావు చేసిన ఓ మంచి సినిమా. ఐశ్వర్యా రాజేష్‌ అనే మంచి నటిని తీర్చిదిద్దిన సినిమా ఈ కౌసల్య కృష్ణమూర్తి. ఎంతో గొప్పగా నటించిన రాజేంద్రప్రసాద్‌ ఈ సినిమాకి మెయిన్‌ ఎస్సెట్‌. అటువంటి రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, భీమనేని శ్రీనివాసరావు.. ఈ ముగ్గురూ తెలుగు ప్రేక్షకులకు అందించే మరో గొప్ప సినిమా కౌసల్య కృష్ణమూర్తి అని నమ్ముతూ.. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ ద్వారా మరో మంచి సినిమాను ప్రజెంట్‌ చేస్తున్నాను. తప్పసరిగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ఈ సినిమా ఆడియో చాలా పెద్ద హిట్‌ అయ్యింది. ముఖ్యంగా ‘ముద్దాబంతి పూవు ఇలా..’ అనే పాటకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ట్రైలర్స్‌కి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కంప్లీట్‌ అయింది. సెన్సార్‌ కూడా పూర్తి చేసుకొని ‘యు’ సర్టిఫికెట్‌ పొందింది. ఆగస్ట్‌ 23న వరల్డ్‌వైడ్‌గా మా సినిమా విడుదలవుతుంది’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సాహో: శ్రద్ధాకి కూడా భారీగానే!

గిఫ్ట్ సిద్ధం చేస్తున్న సూపర్‌ స్టార్‌!

బిగ్‌బాస్‌ 3: నాగ్‌ రికార్డ్‌!

‘అవును.. మేము విడిపోతున్నాం’

‘షారుక్‌ వల్లే హాలీవుడ్‌ వెళ్లాను’

‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!

‘చెంపదెబ్బ కొడితే చాలా ఆనంద‌ప‌డ్డా’

అవును.. ఇది నిజమే : శిల్పాశెట్టి

వాళ్లిద్దరూ విడిపోలేదా..? ఏం జరిగింది?

సింగిల్‌ షాట్‌లో ‘అశ్వద్ధామ’ పోరాటం

'రిటైర్‌మెంట్‌ ఉద్యోగానికి మాత్రమే’

అభిమాని ప్రేమకు పూరీ ఫిదా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..

కాస్ట్యూమ్‌ పడితే చాలు

నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌?

మనీషా మస్కా

సాహో: ది గేమ్‌

రాక్షసుడు నా తొలి సినిమా!

జనగణమన ఎవరు పాడతారు?

అది నా ఇమేజ్‌ కాదు.. సినిమాది!

రవి అవుట్‌ రత్న ఇన్‌!

‘మగధీర’కు పదేళ్లు..రామ్‌చరణ్‌ కామెంట్‌..!

బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం

కంగనాకు ఖరీదైన కారు గిఫ్ట్‌..!

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెంపదెబ్బ కొడితే చాలా ఆనంద‌ప‌డ్డా’

గిఫ్ట్ సిద్ధం చేస్తున్న సూపర్‌ స్టార్‌!

‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!

వాళ్లిద్దరూ విడిపోలేదా..? ఏం జరిగింది?

‘అవును.. మేము విడిపోతున్నాం’

‘షారుక్‌ వల్లే హాలీవుడ్‌ వెళ్లాను’