ఫ్యాన్స్‌తో కలిసి కౌశల్‌ ఇలా..

30 Sep, 2018 21:07 IST|Sakshi

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ తెలుగు-2 సీజన్‌ టైటిల్‌ను గెలిచిన ఆనందంలో మునిగిపోయాడు కౌశల్‌. హౌస్‌ నుంచి బయటకొచ్చిన తర్వాత అక్కడే ఉన్న ఫ్యాన్స్‌తో తన విన్నింగ్స్‌ మూమెంట్స్‌ను పంచుకున్నాడు. తొలుత అతని కోసం బయటవేచి ఉన్న అభిమానులను చూసిన కౌశల్‌ ఉప్పొంగిపోయాడు. ఈ క్రమంలోనే కారుపైకి ఎక్కి అందరికీ అభివాదం చేశాడు. ఇక‍్కడ కౌశల్‌ను ఫొటోలు తీయడానికి ఫ్యాన్స్‌ పోటీ పడగా, వారిని అలానే చూస్తూ ఉండిపోవడం అతని వంతైంది. ‘మాటల్లేవ్‌’అన్న ఫీలింగ్‌ మాత్రమే ఇక్కడ కౌశల్‌ ముఖంలో కనిపించింది. ఒకింత ఆనంద బాష్పాలతో మురిసిపోయాడు కౌశల్‌.

బిగ్‌బాస్ షో ఫైనల్‌ పోరులో భాగంగా టాప్ ఐదుగురు కంటెస్టెంట్‌లో ముందుగా సామ్రాట్‌ ఇంటి నుంచి బయటకు రాగా, ఆ తర్వాత దీప్తి నల్లమోతు బయటకొచ్చారు. దాంతో టాప్‌-3లో కౌశల్‌, గీతా మాధురి, తనీష్‌లు  నిలిచారు. కాగా, అటు తర్వాత తనీష్‌ కూడా నిష్క్రమించడంతో కౌశల్‌-గీతా మాధురిలు మాత్రమే తుది పోరులో నిలిచారు. అయితే అంతా ఊహించినట్లుగానే కౌశల్‌నే టైటిల్‌ వరించింది.

బిగ్‌బాస్‌ విజేత కౌశల్‌

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహేశ్‌బాబుకు జీఎస్టీ ‘షాక్‌’ 

ధనుర్విద్య నేపథ్యంలో...

రొమాంటిక్‌   ఎన్‌ఆర్‌ఐ

మా ఆనందానికి కారణం అభిమానులే

అంతా మాయ.. సినిమాలు వద్దన్నారు – శ్రీధర్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేశ్‌బాబుకు జీఎస్టీ ‘షాక్‌’ 

రొమాంటిక్‌   ఎన్‌ఆర్‌ఐ

మా ఆనందానికి కారణం అభిమానులే

అంతా మాయ.. సినిమాలు వద్దన్నారు – శ్రీధర్‌రెడ్డి

గ్యాంగ్‌స్టర్‌ లవ్‌

భారతీయుడు ఆగడు